Asianet News TeluguAsianet News Telugu

రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్‌కు బుజ్జగింపులు

మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో  కూడ టికెట్లు దక్కని  అసంతృప్తులు నామినేషన్లు దాఖలు చేయడంతో  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బుజ్జగింపులకు దిగింది.  

congress plans to withdraw rebel candidates nominations
Author
Hyderabad, First Published Nov 22, 2018, 7:26 AM IST

హైదరాబాద్: మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో  కూడ టికెట్లు దక్కని  అసంతృప్తులు నామినేషన్లు దాఖలు చేయడంతో  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బుజ్జగింపులకు దిగింది.  పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ  అగ్రనేతలు రంగంలోకి  దిగుతున్నారు.ఈ మేరకుఇవాళ గులాం నబీ ఆజాద్ తో సహా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హైద్రాబాద్‌కు రానున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని 119  అసెంబ్లీ స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. అయితే  మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాల్లో కూడ టికెట్టు దక్కని కాంగ్రెస్ పార్టీ నేతలు  నామినేషన్లు దాఖలు చేశారు.

ఈ పరిస్థితుల  నేపథ్యంలో  మిత్రులకు కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో నామినేషన్లను ఉపసంహరించేందుకు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే పుదుచ్చేరి  సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని త్రీమెన్ కమిటీ  రెండు రోజుల క్రితం 40 మంది అసంతృప్త నేతలతో విడి విడిగా సమావేశమైంది.

అసంతృప్త నేతల డిమాండ్లను త్రీమెన్ కమిటీ  విని, తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి వస్తే సముచిత స్థానాన్ని కల్పిస్తామని హమీలు గుప్పించింది.

పొత్తులో భాగంగా శేరిలింగంపల్లి స్థానం టీడీపికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ . ఈ స్థానంలో  మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్  నామినేషన్ దాఖలు చేశారు.  దీంతో బుధవారం నాడు అర్ధరాత్రి పూట  బిక్షపతి యాదవ్ ఇంటికి   కర్ణాటక మంత్రి డీకే శివకుమార్,  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,  టీ. సుబ్బరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వంటి నేతలు వెళ్లి  బిక్షపతియాదవ్ తో చర్చించారు. శేరిలింగంపల్లిలో నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కూడ  బిక్షపతి యాదవ్ ఇంటికి వెళ్లి నామినేషన్‌ను ఉఫ సంహరించుకోవాలని కోరారు.

భవిష్యత్తులో  బిక్షపతి యాదవ్ కు సముచిత స్థానం కల్పిస్తామని అహ్మద్ పటేల్‌కు హామీ ఇచ్చారు.అయితే భవిష్యత్తులో బిక్షపతి యాదవ్‌కు ఏ రకమైన స్థానం ఇస్తామనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రకటించారు. 

ఇప్పటికే గుర్తించిన 40 మంది అసంతృప్తులతో  కాంగ్రెస్ పార్టీ త్రీమెన్ కమిటీ చర్చించింది.మరో వైపు కాంగ్రెస్ పార్టీ రెబెల్స్‌తో అగ్రనేతలు  చర్చించారు.  అహ్మద్‌పటేల్ లాంటి నేతలు  రెబెల్స్ తో చర్చించారు. గతంలో ఏనాడూ కూడ ఇలా జరగలేదు.  గులాం నబీ అజాద్, వీరప్పమెయిలీ లాంటి నేతలు ఇవాళ హైద్రాబాద్ కు వస్తున్నారు. ఇప్పటికే వీరప్పమెయిలీ హైద్రాబాద్ కు చేరుకొన్నారు. బిక్షపతియాదవ్‌ను బుజ్జగించారు. మిగిలిన అసంతృప్తులతో కూడ చర్చించి  నామినేషన్లను ఉపసంహరణ చేయించనున్నారు.

మేడ్చల్ నుండి బరిలోకి దిగిన జంగయ్య యాదవ్ తో కూడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు చర్చించారు. నామినేషన్ ఉప సంహరించుకోవాలని కోరారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాపోలు ఆనంద భాస్కర్ తో కూడ ఆ పార్టీ నేతలు చర్చించారు.

సంబంధిత వార్తలు

జానారెడ్డికి షాక్: ఆరుగురితో కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్, టీడీపీ నేతకు టికెట్టు

ఆ ఆరుగురు ఎవరో: కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదలలో ఉత్కంఠ

రాజకీయ సన్యాసం చేస్తా:కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి

కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

 

Follow Us:
Download App:
  • android
  • ios