Asianet News TeluguAsianet News Telugu

అక్రమ సంబంధం సిఐ పై వేటు

  • అర్థరాత్రి పట్టుకుని చెప్పుదెబ్బలు కొట్టిన వైనం
  • అర్థరాత్రి సిఐ మల్లిఖార్జునరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ci mallikarjuna reddy suspend

పై అధికారితో అక్రమ సంబంధం పెట్టుకున్న కల్వకుర్తి సిఐ మల్లిఖార్జునరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. సిఐ మల్లిఖార్జునరెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ జోన్ ఐజి స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ అక్రమ సంబంధం వ్యవహారంలో అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి స్టేట్ మెంట్ రికార్డు చేశారు పోలీసులు.

ఎసిబిలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న సునీతారెడ్డితో గత కొంతకాలంగా సిఐ మల్లిఖార్జునరెడ్డి అక్రమ సంబంధం నడుపుతున్నాడు. ఈ  వ్యవహారంపై పలుమార్లు గొడవుల అయ్యాయి. సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. దీంతో ఎసిబిలో ఉన్న మల్లిఖార్జునరెడ్డిని కల్వకుర్తికి బదిలీ చేశారు పోలీసు పెద్దలు.

అయినప్పటికీ వారిద్దరి మధ్య అక్రమ సంబంధం తెగిపోలేదు. అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండురోజులుగా వీరి బండారాన్ని బయట పెట్టేందుకు సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పథకం ప్రకారం వ్యవహరించారు. గుట్టు రట్టు చేశారు. సురేందర్ రెడ్డి తల్లి, ఆయన అత్త ఇద్దరూ ఈ విషయంలో సురేందర్ కు సహకరించారు. ఇక సిఐని అర్థరాత్రి ఇంటికి వచ్చిపోతుండగా మాటు వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదారు. చెప్పులతో తరిమి తరిమి కొట్టారు.

సునీతారెడ్డి భర్త ఫిర్యాదు ఆధారంగా కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నాగర్ కర్నూలు ఎస్పీకి నివేదిక పంపారు. అంతిమంగా సిఐ మల్లిఖార్జునరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక సునీతారెడ్డిపై ఏ రకమైన చర్యలుంటాయన్నది ఇప్పుడు పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్.

Follow Us:
Download App:
  • android
  • ios