Asianet News TeluguAsianet News Telugu

షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: చిన్నారి మృతి, మరో ఆరుగురి పరిస్థితి విషమం

హైద్రాబాద్ ఎల్బీనగర్ ‌లోని ఓ షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందాడు.  మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.
 

child dies after fire accident in shine hospital in Hyderabad
Author
Hyderabad, First Published Oct 21, 2019, 7:32 AM IST

హైదరాబాద్: హైద్రాబాద్ ఎల్బీనగర్ ‌లోని ఓ షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందాడు.  మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.

సోమవారం నాడు తెల్లవారుజామున ఈ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా  ఆసుపత్రిలోని గ్యాస్ సిలిండర్లు పేలుడు చోటు చేసుకొందని పోలీసులు అనుమాానిస్తున్నారు. ఈ ఘనట చోటు చేసుకొన్న సమయంలో ఐసీయూలో చిన్నారులు ఉన్నారు. అయితే చిన్నాారులను ఐసీయూలోనే ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు పేలుడు వల్ల భారీగా పేలుడు శబ్దాలు విన్పించాయి.

అయితే పిల్లల తల్లిదంద్రులు ఆందోళన చెందుతున్నా కూడ పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఓ చిన్నారి తండ్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్నా ఐసీయూ  తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే ఆ గదిలో పొగ నిండిపోయింది.

పొగ కారణంగా చిన్నారులకు ఊపిరి ఆడలేదు. ఊపిరి ఆడని కారణంగా ఓ చిన్నారి మృత్యువాత పడ్డారు.మరో ఆరుగురు చిన్నారులను పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అతి కష్టం మీద మంటలను ఆర్పారు.

డెంగ్యూ జ్వరాలతో పాటు ఇతర వ్యాధులకు చికిత్స కోసం చిన్నారులను షైన్ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల క్రితం వరకు ఈ ఆసుపత్రిలోని ఐసీయూలో నలుగురు మాత్రమే చిన్నారులు ఉన్నారు. అయితే నిన్న ఆరుగురు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. 

ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు.మంటల కారణంగా ఆసుపత్రిలోని  గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. 

ఈ శబ్దాలు విన్న పిల్లల తల్లిదండ్రులను పైకి వెళ్లకుండా ఆసుపత్రి సిబ్బంది అడ్డుకొన్నారు. తమనను పైకి వెళ్లకుండా రూమ్ లో వేశారని రోగుల బంధువులు చెప్పారు. సోమవారం నాడు ఉదయం తమ చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదని ఓ చిన్నారి కుటుంబసభ్యులు మీడియా ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అప్పుడు ఆ చిన్నారిని వేరే ఆసుపత్రికి తరలించారు.

ఐసీయూలో అస్వస్థతకు గురైన ఆరుగురు చిన్నారులను ఏ ఆసుపత్రుల్లో చేర్పించారనే విషయమై తమకు చెప్పాలని కూడ రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తమ పిల్లలు ఏ ఆసుపత్రుల్లో చేర్పించారో కూడ స్పష్టంగా చెప్పడం లేదని కూడ వారు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. 

ఆసుపత్రి యాజమాన్యానికి పోలీసులు సహకరిస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను తమకు చూపించాలని కూడ వారు కోరుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం వేలాది రూపాయాలను తమ నుండి వసూలు చేసి కూడ సరైన భద్రత పాటించలేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఈ ప్రమాదం వాటిల్లిందని వారు ఆరోపిస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios