Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ 'చిచ్చు' కామెంట్‌‌కు చంద్రబాబు కౌంటర్

తెలుగు జాతి కలిసుంటే  కేసీఆర్ కు పబ్బం గడవదు. అందుకే  తాను తెలుగు జాతి మధ్య  చిచ్చు పెడుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కౌంటరిచ్చారు.

chandrababunaidu reacts on kcr comments in filmnagar road show
Author
Hyderabad, First Published Dec 3, 2018, 4:56 PM IST


హైదరాబాద్: తెలుగు జాతి కలిసుంటే  కేసీఆర్ కు పబ్బం గడవదు. అందుకే  తాను తెలుగు జాతి మధ్య  చిచ్చు పెడుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కౌంటరిచ్చారు.

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నాడు  నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబునాయుడు మాట్లాడారు.ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలుగా  విభజనకు గురైందన్నారు. నేను పేదల కోసం వచ్చినట్టు చెప్పారు. ప్రజా కూటమి కోసం వచ్చినట్టు బాబు చెప్పారు. 

సైబరాబాద్ నగరాన్ని తాను నిర్మించినట్టు  బాబు గుర్తు చేశారు.నేను ఏం చేశానో ఇప్పటికీ చెబుతున్నానని  బాబు చెప్పారు.  కానీ నాలుగున్నర ఏళ్లలో ప్రజలకు గుర్తుండే పనిని ఏమైనా  కేసీఆర్ చేశారో చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. 

విభజన సమయంలో  తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని ఆయన గుర్తు చేశారు. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాల్సిన  రాష్ట్రం. కానీ తెలంగాణ రాష్ట్రం 23 శాతం అప్పులు చేశారన్నారు. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్‌ చెబుతోందన్నారు.

అప్పులు తెచ్చి కేసీఆర్ పేదలకు ఏం  చేశారో చెప్పాలని బాబు కోరారు. కాంగ్రెస్, టీడీపీలు  దేశ ప్రయోజనం కోసం కలిసి పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.తెలంగాణలో జూనియర్ మోడీ.. కేసీఆర్ నియంత.  నిన్న కూడ నా కోసం మీటింగ్ పెట్టారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడ నేనే కన్పిస్తున్నానని బాబు ఎద్దేవా చేశారు.

నేను ఇక్కడ ముఖ్యమంత్రిని అవుతానా.. ఇక్కడ ముఖ్యమంత్రిని అయ్యే ఛాన్స్ లేదన్నారు.  తెలంగాణలో ప్రజా కూటమి విజయం సాధిస్తోందని బాధతోనే  కేసీఆర్ తన మీద విమర్శలు చేస్తున్నారన్నారు.

బీజేపీయేతర వ్యతిరేక ప్రంట్ ఏర్పాటు పేరుతో కొన్ని రాష్ట్రాలు తిరిగి బీజేపీకి ప్రయోజనం కల్గించేందుకు కేసీఆర్ ప్రయత్నించారని  బాబు ఆరోపించారు.దేశంలో బీజేపీ కూటమి,  బీజేపీయేతర కూటములు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ కు ఓటు బ్యాంకు లేదన్నారు. నేను తెలుగు జాతి మధ్య చిచ్చు పెడుతున్నారని కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. నేను తెలుగు జాతి అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్టు  చెప్పారు.

నేను లేకపోతే నీవు ఎక్కడి నుండి వచ్చావని కేసీఆర్‌ను చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం,  54 శాతం ఆదాయం ఉన్న రాష్ట్రం ఉందన్నారు. అన్ని వనరులున్నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని  చంద్రబాబు చెప్పారు.తెలంగాణలో సమర్ధవంతమైన నాయకత్వం లేదన్నారు.

తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు  పల్లకిని మోస్తున్నారని బాబు తెలిపారు. ప్రజా కూటమి కోసం తమ పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తున్నారని బాబు చెప్పారు. తెలుగుజాతి కలిసుండాలన్నారు. తెలుగు జాతి కోసం నేను తగ్గాను. నా వద్ద పనిచేసిన కేసీఆర్ వద్దకు  కూడ వెళ్లినట్టు చెప్పారు.  తెలుగు జాతి కలిసుంటే  కేసీఆర్ కు పబ్బం గడవదన్నారు. అందుకే  తాను తెలుగు జాతి మధ్య  చిచ్చు పెడుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌పై విమర్శలు  చేశారు.

హైద్రాబాద్ లో అన్ని సీట్లు ప్రజా కూటమి విజయం సాధిస్తోందన్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా  ప్రజలు  తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వనున్నారన్నారు. ఈ మేరకు సర్వే రిపోర్టులు వస్తున్నాయన్నారు.  ఈ సర్వే రిపోర్టుల భయంతోనే  తనను కేసీఆర్ తిట్టిపోస్తున్నారన్నారు. కేసీఆర్ తిట్లను ఆశీర్వాదాలుగా తీసుకొంటున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు: బాబు

హైద్రాబాద్ వాసుల మధ్య చిచ్చు: బాబుపై కేసీఆర్ సంచలనం

బాబుకు కౌంటర్: ఏపీ రాజకీయాల్లో వేలు పెడతాం: కేటీఆర్

కేసీఆర్, కేటీఆర్‌ల బెదిరింపులకు భయపడను: చంద్రబాబు

కేటీఆర్ ను ముద్దుగా కేసీఆర్ ఎలా పిలుస్తారో తెలుసా?

తేలుస్తాం: చంద్రబాబుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆస్తులపై సంచలనం: కేటీఆర్ అసలు పేరు చెప్పిన యాష్కీ

రేపు కవిత చిట్టా విప్పుతా: కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై యాష్కీ సంచలనం


 

Follow Us:
Download App:
  • android
  • ios