Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్, కేటీఆర్‌ల బెదిరింపులకు భయపడను: చంద్రబాబు

కేసీఆర్, కేటీఆర్ బెదిరింపులకు తాను భయపడనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 

chandrababu naidu slams on kcr in malakpet road show
Author
Hyderabad, First Published Dec 2, 2018, 4:39 PM IST

హైదరాబాద్: కేసీఆర్, కేటీఆర్ బెదిరింపులకు తాను భయపడనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 

మలక్‌పేట రోడ్ షో లో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆదివారం నాడు పాల్గొన్నారు.తెలంగాణ సీఎం ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడ అమలు చేయలేదన్నారు.  హైద్రాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టినట్టు చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

ఆదాయాన్ని పెంచితే  కేసీఆర్ దుబారాగా ఖర్చు చేస్తున్నారని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక  ఏమైనా ప్రయోజనమైందా అని బాబు ప్రశ్నించారు.

తెలంగాణ అంటే తనకు అమితమైన ప్రేమ అని చంద్రబాబునాయుడు చెప్పారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక  ఏమైనా ప్రయోజనమైందా అని బాబు ప్రశ్నించారు.

తెలంగాణ అంటే తనకు అమితమైన ప్రేమ అని చంద్రబాబునాయుడు చెప్పారు.హైద్రాబాద్ ను అభివృద్ధి చేసింది ఓ కుటుంబం కోసం కాదన్నారు.టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మత సామరస్యాన్ని కాపాడిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. కర్ప్యూ వాతావరణం లేకుండా పనిచేసిన ఘనత టీడీపీదేనన్నారు. 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే  ప్రభుత్వాన్ని చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని బీజేపీ చేసిందన్నారు.ట్రిపుల్ తలాక్  విషయంలో టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్  విషయంలో కేసీఆర్, ఎంఐఎంలు ఎందుకు వ్యతిరేకించలేదో చెప్పాలన్నారు.

మోడీ ఏ టీమ్ అయితే కేసీఆర్ మోడీకి బీ టీమ్ అని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. దేశంలో అరాచక పరిస్థితులు ఉన్నాయన్నారు. ముస్లింలు, దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 

రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్వ్యం  బీజేపీ ప్రయత్నం చేస్తోంది. చివరకు కేటీఆర్ కూడ తనను బెదిరించే ప్రయత్నించారన్నారు. మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.తెలంగాణ ప్రజల కోసం తాను హైద్రాబాద్ కు వచ్చినట్టు బాబు చెప్పారు. దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు బాబు వివరించారు.

కేసీఆర్ సీఎం కావాలని ఎంఐఎం నేతలు చెబుతున్నారని.. ఎంఐఎం ఎందుకు పోటీ చేస్తోందని ఆయన ప్రశ్నించారు. దేశంలో రెండు ఫ్రంట్ లు మాత్రమే ఉన్నాయన్నారు. ఎన్డీఏ ఒకటి, రెండోది బీజేపీయేతర పార్టీల ఫ్రంట్ అని బాబు చెప్పారు.కేసీఆర్ నీది ఏ ఫ్రంట్ అని బాబు ప్రశ్నించారు.

అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ లు మోడీకి బీ టీమ్ గా పనిచేస్తున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.ఎంఐఎం తెలివిగా పోటీ చేస్తోందన్నారు. యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేసి బీజేపీ గెలుపుకు సహకరించిందన్నారు. తెలంగాణలో ఎంఐఎం ఎందుకు కేవలం 7 సీట్లలోనే పోటీ చేస్తోందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

టీఆర్ఎస్‌కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్టేనని చంద్రబాబునాయుడు చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీని, ట్రిపుల్ తలాక్ ను కేసీఆర్ సమర్ధించారని బాబు చెప్పారు.

నా కంటే కేసీఆర్‌కు మెచ్యూరిటీ ఉందని మోడీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారని బాబు ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్కడ పెరిగారో చెప్పాలన్నారు.

గతాన్ని మర్చిపోయి కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. మీ అందరికీ సేవ చేసేందుకు, మంచి జరిపించేందుకు వచ్చినట్టు బాబు తెలిపారుదేవాదుల, కల్వకుర్తి, భీమా , మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించింది తానేనని బాబు గుర్తు చేశారు.నదుల నీళ్లను రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని తాను కోరితే కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios