Asianet News TeluguAsianet News Telugu

లాకర్లకు ‘‘చెదల’’ భయం...బ్యాంకులకు పరిగెడుతున్న జనం

ఎంతో విలువైన పత్రాలు ఇంట్లో ఉంటే దొంగల పాలవుతాయనో లేదంటే పోతాయేమోనన్న ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులు వాటిని బ్యాంకు లాకర్లలో సేఫ్‌గా ఉంచుతారు. అయితే అక్కడ పత్రాలు సురక్షితంగా ఉన్నప్పటికీ చెదలకు ఆహారంగా మారుతున్నాయి.

bank customers check their lockers
Author
Hyderabad, First Published Mar 8, 2019, 10:34 AM IST

ఎంతో విలువైన పత్రాలు ఇంట్లో ఉంటే దొంగల పాలవుతాయనో లేదంటే పోతాయేమోనన్న ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులు వాటిని బ్యాంకు లాకర్లలో సేఫ్‌గా ఉంచుతారు. అయితే అక్కడ పత్రాలు సురక్షితంగా ఉన్నప్పటికీ చెదలకు ఆహారంగా మారుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ ఎల్బీ నగర్‌ ఆంధ్రాబ్యాంక్ లాకర్‌లో ఉన్న దస్తావేజులకు చెదలు పట్టడం ఇప్పుడు ఖాతాదారుల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరు ఉపాధ్యాయులు తమ లాకర్‌ను పరిశీలించి చూడగా అందులో దస్తావేజులను చెదలు పూర్తిగా తినేశాయి.

ఈ విషయం తెలుసుకున్న మిగిలిన ఖాతాదారులు తమ లాకర్ల పరిస్థితి ఏంటోనన్న భయంతో బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. ఈ విషయంపై లాకర్లను సరఫరా చేస్తున్న గోద్రేజ్ కంపెనీ అప్రమత్తమైంది.

ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారులు సైతం ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ వ్యవహారంతో మిగిలిన బ్యాంకులకు చెందిన ఖాతాదారులు సైతం తమ లాకర్లను ఒకసారి చెక్ చేసుకుంటున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios