Asianet News TeluguAsianet News Telugu

నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు వేగవంతం: కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

ఇకపోతే పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఝాన్సీ ప్రియుడు సూర్య అలియాస్ నాని గురించి పదేపదే ప్రస్తావించిందని తెలుస్తోంది. సూర్య కోసం అవసరమైతే నటనను సైతం వదిలిపెడతానని డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది. 

anchor jhansi suicide case: acp vijaykumar recovery dairy
Author
Hyderabad, First Published Feb 9, 2019, 9:50 PM IST

హైదరాబాద్: సినీనటి, యాంకర్ ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శనివారం ఝాన్సీ తల్లి అన్నపూర్ణతోపాటు పలువురు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు సూర్యను అదుపులోకి తీసుకోవాలని కోరారు. 

దీంతో ఏసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం కేసు విచారణను వేగవంతం చేసింది. విచారణలో భాగంగా శనివారం సాయంత్రం ఝాన్సీ ఇంటికి వెళ్లారు. ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఝాన్సీ రూమ్, ఆత్మహత్య చేసుకున్న స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 

పోలీసుల సోదాల్లో ఝాన్సీ రాసుకున్నడైరీ లభ్యమైంది. ఆ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఝాన్సీకి సంబంధించి సూసైడ్ నోట్ రాసిందా అన్న కోణంలో కుటుంబ సభ్యులను విచారించారు. కుటుంబ సభ్యులతోపాటు అపార్ట్ మెంట్ వాసులను కూడా పోలీసులు విచారించారు. 

ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వాలని కోరారు. అయితే విచారణలో ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్ధారించేందుకు సరైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన పలు టిక్‌‌టాక్ వీడియోలను పోలీసులు అధ్యయనం చేశారు. 

ప్రియుడు సూర్య వేధింపులు భరించలేకపోయిందని పోలీసులు నిర్ధారించారు. ఇకపోతే సూరి వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి అన్నపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లిపేరుతో తన సోదరిని సూర్య మోసం చేశాడని ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్ ఆరోపించారు. 

ఇకపోతే పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఝాన్సీ ప్రియుడు సూర్య అలియాస్ నాని గురించి పదేపదే ప్రస్తావించిందని తెలుస్తోంది. సూర్య కోసం అవసరమైతే నటనను సైతం వదిలిపెడతానని డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇంకా ఆ డైరీలో ఏమున్నాయి అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్య త్వరలో తాను హైదరాబాద్ వచ్చి తన దగ్గర ఉన్న ఆధారాలు బయటపెడతానని చెప్తున్నాడు. ఝాన్సీ ఆత్మహత్య కేసును విచారిస్తున్నామని ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. 

సూర్యవేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందనడానికి తమకు ఆధారాలు లభించినట్లు ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. సూర్యకోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios