Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎన్నికలు: ఓటరు తీర్పు నేడే.. పోలింగ్‌కు సర్వం సిద్ధం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ జరగనుంది.. మొత్తం 119 శాసనసభ స్థానాల్లో... 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

All arrangements in place for Telangana Assembly elections
Author
Hyderabad, First Published Dec 6, 2018, 8:35 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ జరగనుంది.. మొత్తం 119 శాసనసభ స్థానాల్లో... 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంచారు. ఓటర్, పోలింగ్ బూత్‌ల సమాచారం కోసం నా ఓటు యాప్‌‌ను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 279 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 5 రాష్ట్రాల నుంచి 18,860 మంది బలగాలను మోహరించారు.  

దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, బ్రెయిలీ లిపీలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స, ర్యాంపులు ఏర్పాటు చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో పోలింగ్ కేంద్రంలోనే తెలుసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ, వెబ్‌ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు.

మీ ఓటు, పోలింగ్ బూత్‌ ఎక్కడుందో తెలుసుకోండిలా..

ఓటరు కార్డు లేకపోయినా.. ఈ 13 కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు

Follow Us:
Download App:
  • android
  • ios