Asianet News TeluguAsianet News Telugu

రెండేళ్లుగా అమ్మాయిపై 11 మంది రేప్: నిందితులు వీరే...

రెండేళ్లక్రితం ఓరోజు కుటుంబసభ్యులు పనికి వెళ్లిన తర్వాత బాలిక ఒంటరిగా ఉండడం చూసి సమీప బంధువైన రాజేశ్‌ (25) ఇంట్లోకి వచ్చాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించాడు. 

Accused in rape case in old city yet to be nabbed
Author
Hyderabad, First Published Jan 14, 2019, 10:15 AM IST

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. రెండేళ్లుగా 16 ఏళ్ల బాలికపై 11 మంది కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఆ బాలిక సమీప బంధువేనని తెలుస్తోంది. 

ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు  ప్రధాన నిందితుడు సహా ముగ్గురినే పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తిని అరెస్టు చేయకుండా సాక్షిగా చేర్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ కామాటిపురలో ఈ ఘోరం జరిగింది. 

నిందితుల్లో చాలామంది బయటే తిరుగుతున్నారని పోలీసులపై ఆదివారం బాధిత బాలిక బంధువులు ఆగ్రహించడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
 
ఓ ఆయిల్‌ వ్యాపారి తన కుటుంబంతో కలిసి కామాటిపుర ప్రాంతంలో నివసిస్తున్నాడు. రెండేళ్లక్రితం ఓరోజు కుటుంబసభ్యులు పనికి వెళ్లిన తర్వాత బాలిక ఒంటరిగా ఉండడం చూసి సమీప బంధువైన రాజేశ్‌ (25) ఇంట్లోకి వచ్చాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించాడు. 

ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. కొన్నాళ్లకు ఆ వీడియోను స్నేహితులు అభిజిత్‌ కౌశిక్‌, శుభమ్‌ వ్యాస్‌లకు షేర్‌ చేశాడు. తర్వాత ఆ వీడియో షేరవుతూ 10మందికి చేరింది. వీడియోను బయటపెడతామని బెదిరిస్తూ రాజేశ్‌, అబిజిత్‌, శుభమ్‌తో పాటు మిగతా 8మంది బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు డిసెంబరు 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిసెంబరు 31న రాజేశ్‌, అభిజిత్‌, శుభమ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించి విజయ్‌కుమార్‌ను పోలీసులు సాక్షిగా చేర్చారు. తమ బాధిత కుటుంబసభ్యులు ఆదివారం బస్తీలో, కామాటిపురా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. 

                                  Accused in rape case in old city yet to be nabbed

మిగతావారినీ అరెస్ట్‌ చేసి, ఉరితీయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దక్షిణ మండలం అడిషనల్‌ డీసీపీ మహ్మద్‌ రఫీక్‌, మీర్‌చౌక్‌ ఏసీపీ బి.ఆనంద్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

బాధిత బాలిక వాంగూల్మనం నమోదు చేశారు. సాక్షిగా ఉన్న విజయ్‌ కుమార్‌ కూడా తనపై అత్యాచారం జరిపినట్లు బాలిక చెప్పడంతో కేసును సీసీఎ్‌సకు బదిలీ చేసినట్లు సీపీ చెప్పారు.

అమ్మాయిపై రేప్: పాతబస్తీలో నిరసన వెల్లువ (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios