Asianet News TeluguAsianet News Telugu

#exitpolls: హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయం.... మిషన్ చాణక్య,ఆరా సర్వే

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి సైది రెడ్డి విజయం సాధిస్తాడని మిషన్ చాణక్య, ఆరా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడించాయి.. పోలింగ్ అధికంగా నమోదయ్యిందని, గత పర్యాయం కూడా ఇదే విధంగా ఇక్కడ భారీ స్థాయిలో పోలింగ్ నమోదయ్యిందని వారు తెలిపారు.  

#exitpoll: trs to win in huzoornagar..predicts mission chanakya, aara
Author
Huzur Nagar, First Published Oct 21, 2019, 7:43 PM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి సైది రెడ్డి విజయం సాధిస్తాడని మిషన్ చాణక్య, ఆరా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడించాయి.. పోలింగ్ అధికంగా నమోదయ్యిందని, గత పర్యాయం కూడా ఇదే విధంగా ఇక్కడ భారీ స్థాయిలో పోలింగ్ నమోదయ్యిందని వారు తెలిపారు.  

సాయంత్రానికే 84 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇంకా ఇది పెరగవచ్చు. గత పర్యాయం కూడా ఇక్కడ 86 శాతం పోలింగ్ నమోదయ్యిందని, దీని ఆధారంగా ఇక్కడ ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. 

Read more సైదిరెడ్డిదే విజయం.. కార్యకర్తలకు ధన్యవాదాలు: కేటీఆర్...
 హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 

ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల కంటే భారీగా నమోదు అయ్యింది. మధ్యాహ్నాం 3 గంటలకే 70 శాతం పోలింగ్ నమోదైంది. అయితే సాయంత్రం 5 గంటలకు పోలింగ్ 83 శాతం నమోదు అయ్యింది. 

Read more కొంప ముంచేనా...?: ముగిసిన హుజూర్ నగర్ పోలింగ్, 83శాతం నమోదు...

హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇప్పటికీ క్యూలో అనేక మంది ఓటర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే 5 గంటల వరకు క్యూలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటు వేసుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. 

ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఈవీఎంలను హుజూర్ నగర్ తరలిస్తారు. అక్కడ నుంచి సూర్యాపేటకు ఈవీఎం, వీవీప్యాడ్ లను ఎన్నికల సిబ్బంది తరలించనున్నారు. ఇకపోతే ఈ ఉపఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఈనెల 24న జరగనుంది. 
Read more ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్: హర్యానాలో కట్టర్ కే మళ్లీ పట్టాభిషేకం, బీజేపీ ధూంధాం...

అయితే ఈ ఉపఎన్నికల్లో నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం జరిగింది. గెలుపుపై అటు అధికార టీఆర్ఎస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నాయి. గెలుపు తనదేనని ఉత్తమ్ పద్మావతి రెడ్డి చెప్తుండగా ఈసారి విజయం నాదేనంటున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. మరి ఎవరు గెలిచారో ఓటర్లు ఎవరికి పట్టంకట్టనున్నారో తెలియాలంటే ఈనెల 24 వరకు వేచి చూడాల్సిందే. 

ఇకపోతే ఈ ఎన్నికల్లో మెుత్తం 28 మంది అభ్యర్థులు పోటీపడగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పోటీ చేస్తున్నారు. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు.  

హుజూర్ నగర్ ఉప ఎన్నిక గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు. 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో మళ్లీ హుజూర్ నగర్ ను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. 

Read more Exit polls 2019: మహారాష్ట్ర, హర్యానాల్లో వార్ వన్‌సైడ్...

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఈ ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారం రోజులకు పైగా అక్కడే తిష్టవేశారు. 

ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ సైతం హుజూర్ నగర్ ను తమ ఖాతాలోకి వేసుకోవాలని భావిస్తోంది. హుజూర్ నగర్ పై కన్నేసిన గులాబీ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలను అక్కడకు పంపారు. టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అక్కడే మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ఉప ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యే నెలకొంది. ఇకపోతే ఉదయం నుంచి హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. సమయం అయిపోయిన తర్వాత కూడా ప్రజలు పోలిగ్ బూత్ ల దగ్గర బారులు తీరి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios