Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రాజకీయ ప్రముఖులు ఎక్కడెక్కడ ఓటేయనున్నారంటే...

తెలంగాణ వ్యాప్తంగా గురువారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవగా ప్రజలు ఉత్సహంగా ఓటుహక్కును వినియోగించుకోడానికి పోలింగ్ బూతులకు కదులుతున్నారు. కేవలం సామాన్యులే కాదు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులు, ఎంపీ అభ్యర్థులు, సినీ, క్రీడా ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
telangana political leaders cast their votes
Author
Hyderabad, First Published Apr 11, 2019, 8:06 AM IST

తెలంగాణ వ్యాప్తంగా గురువారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవగా ప్రజలు ఉత్సహంగా ఓటుహక్కును వినియోగించుకోడానికి పోలింగ్ బూతులకు కదులుతున్నారు. కేవలం సామాన్యులే కాదు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులు, ఎంపీ అభ్యర్థులు, సినీ, క్రీడా ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని తన స్వగ్రామం చింతమడకలో ఓటేయనున్నారు. ఆయన సతీసమేతంగా ప్రత్యేక  హెలికాప్టర్ లో చింతమడకకు చేరుకుని ఓటేసిన తర్వాత మళ్లీ అదే హెలికాప్టర్ లో హైదరాబాద్ కు  వస్తారు. ఈ మేరకు సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం  హెలిప్యాడ్ ఏర్పాట్లను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం రాత్రి పరిశీలించారు. 

ఇక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎంఎస్ మక్తాలోని పోలింగ్ బూతులో నరసింహన్, విమలా నరసింహన్ 9గంటలకు ఓటేయయనున్నట్లు రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు. 

ఇక సీఎం తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోనే ఓటేయనున్నారు. ఆయన తన భార్యతో కలిసి నందినగర్ జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్లో ఓటేయనున్నారు. అలాగే సీఎం కూతురు, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత బోధన్ సమీపంలోని పొతంగల్ గ్రామంలో భర్తతో కలిసి ఓటేయనున్నారు. 

తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఓటేయనున్నారు. ఆజంపురాలో కిడ్జి ప్లే స్కూల్లో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ చిక్కడ్ పల్లి శాంతినికేతన్ స్కూల్, బండారు దత్తాత్రేయ రాంనగర్ జేవి హైస్కూల్ పోలింగ్ బూత్ లలో ఓటేయనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios