Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్‌ పోలింగ్‌కు బెంగుళూరు నుండి మూడు ట్రక్కుల్లో ఈవీఎంలు

 నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్‌లో  ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బెంగుళూరు నుండి మూడు ట్రక్కుల నిండా ఈవీఎంలు నిజామాబాద్‌కు చేరుకొన్నాయి.

ec shifted three truck load of evms to nizambad
Author
Nizamabad, First Published Apr 3, 2019, 4:17 PM IST

నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్‌లో  ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బెంగుళూరు నుండి మూడు ట్రక్కుల నిండా ఈవీఎంలు నిజామాబాద్‌కు చేరుకొన్నాయి.

నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 185 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. వీరిలో 177 మంది అభ్యర్థులు రైతులే. పసుపు, ఎర్రజొన్న రైతులు ఈ నియోజకవర్గంలో పోటీకి దిగారు.

తమ డిమాండ్ల సాధన కోసం వీరంతా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. 96 కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు బరిలో ఉంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ,  ఈవీఎంల ద్వారానే ఈ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సిద్దమైంది.

12 ఈవీఎంలకు ఒక కంట్రోలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ తరహాలో ఎన్నికలను నిర్వహించడం బహుశా ఇదే తొలిసారిగా నిపుణులు చెబుతున్నారు.

బెంగుళూరు నుండి  బుధవారం నాడు మూడు ట్రక్కుల ఈవీఎంలు నిజామాబాద్‌కు వచ్చాయి.  ఈవీఎంల పనితీరును సరిచూసేందుకు 600 మంది ఇంజనీర్లు నిజామాబాద్‌కు వచ్చారు.

ప్రతి ఒక్క ఈవీఎంల పనితీరును ఇంజనీర్లు పరిశీలిస్తారు. మరోవైపు పోలింగ్ సిబ్బందిని కూడ పెంచింది ఈసీ.  ఇదిలా ఉంటే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని బరిలో ఉన్న రైతు అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. తమకు గుర్తులు కేటాయించలేదని కొందరు రైతు అభ్యర్థులు ఈవీఎం సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

నిజామాబాద్ సీట్లో ఈవీఎంలే వాడుతాం: ఈసీ

ఇందూరు ఫైట్: బ్యాలెట్‌ పేపర్‌కే రైతుల పట్టు

నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

దిగిరాని రైతులు: కవిత సహా ప్రధాన పార్టీల అభ్యర్థులకు తిప్పలే

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)

Follow Us:
Download App:
  • android
  • ios