Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్ న్యూస్..ఆగిపోయిన యూట్యూబ్

సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌ పనిచేయడం ఆగిపోయింది. 

YouTube back up after global outage
Author
Hyderabad, First Published Oct 17, 2018, 10:02 AM IST

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌ ఆకస్మత్తుగా నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌ పనిచేయడం ఆగిపోయింది. అనేక మంది నెటిజన్లు యూట్యూబ్‌, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను సంస్థ దృష్టికి తెలియజేస్తూ రిపోర్ట్‌ చేశారు. దీంతో ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్‌డేట్‌ చేస్తామని యూట్యూబ్‌ సంస్థ  ట్విటర్‌లో పేర్కొంది.

యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే 500 ఇంటర్నల్‌ సర్వర్‌ ఎర్రర్‌, 503 నెట్‌వర్క్‌ ఎర్రర్‌ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేస్తున్నారు. అలాగే యూజర్స్‌కు వెబ్‌సైట్‌ లాగిన్‌ కావడం లేదని పేర్కొన్నారు. 40 నిమిషాల తర్వాత సమస్యను పరిష్కరించారు. గత నెలలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇలాగే క్రాష్‌ అయిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios