Asianet News TeluguAsianet News Telugu

టిక్‌టాక్ యాప్ కాదు...ఇప్పుడు టిక్‌టాక్ ఫోన్...అదేంటంటే...

టిక్‌టాక్ యజమాని బైట్‌డాన్స్ తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. స్నాప్‌డ్రాగన్ 855+ SoC తో స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 స్మార్టిసాన్ ఓఎస్ 7తో నడుస్తుంది.  లాక్ స్క్రీన్ నుండి టిక్‌టాక్ యాప్   క్విక్ యాక్సెస్ అందిస్తుంది.
 

tiktok owner now launching tiktok mobile phone
Author
Hyderabad, First Published Nov 2, 2019, 5:04 PM IST

టిక్‌టాక్ యజమాని బైట్‌డాన్స్ ఈ ఏడాది ప్రారంభంలో తన సొంత స్మార్ట్‌ఫోన్‌లో పనిచేస్తున్నామని తెలిపింది. ఇది స్నాప్‌డ్రాగన్ 855+ SoC చేత శక్తినిచ్చే ఒక ప్రధాన ఫోన్ , నాలుగు బ్యాక్ కెమెరాలతో వస్తుంది. ఫోన్ సెల్ఫీ లైటింగ్ వంటి సాఫ్ట్‌వేర్ ఫిచర్ ఇందులో అందిస్తుంది. లాక్ స్క్రీన్‌లో ఒకే స్వైప్‌తో టిక్‌టాక్ యాప్ నేరుగా యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.


స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 ధర

స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 అకా నట్ ప్రో 3 చైనాలో మూడు కాన్ఫిగరేషన్లు, మూడు కలర్ ఆప్షన్లలో ప్రారంభించబడింది. బేస్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ చైనాలో CNY 2,899 (సుమారు రూ. 29,000) గా ఉండగా, 8GB + 256GB వెర్షన్ CNY 3,199 (సుమారు రూ. 32,000) ధరను కలిగి ఉంది.

also read యాపిల్ తో సమరానికి గూగుల్ 'సై'...

ఈ రెండు వేరియంట్లు బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. 12GB + 256GB వేరియంట్ కూడా ఉంది, ఇది గ్రీన్-ఇష్ మాట్సుటేక్ రంగులో మాత్రమే వస్తుంది. ఇది  అక్కడి మార్కెట్లో CNY 3,599 (సుమారు రూ. 36,000) ధరను కలిగి ఉంది.

స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 ఇప్పుడు చైనాలో అమ్మకానికి  సిద్ధంగా ఉంది. మొదటి  సారి అమ్మకాలలో ఫోన్ యొక్క అన్ని వేరియంట్లలో సిఎన్వై 200 (సుమారు రూ. 2,000) తగ్గింపును అందిస్తుంది. అయితే, చైనా కాకుండా ఇతర దేశ మార్కెట్లలో ఫోన్ లభ్యతపై సమాచారం లేదు.

tiktok owner now launching tiktok mobile phone

స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 స్పెసిఫికేషన్స్

 ఇందులో డ్యూయల్ సిమ్ (నానో) , స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 స్మార్టిసాన్ ఓఎస్ 7తో వస్తుంది.  ఇది 6.39-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1080 x 2340 పిక్సెల్స్) అమోలేడ్ డిస్‌ప్లేను 403 పిపి పిక్సెల్ డెన్సిటీ మరియు 100,000: 1 కాంట్రాస్ట్ రేషియోతో కలిగి ఉంటుంది. 12GB వరకు ర్యామ్‌తో జత చేసిన స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్  శక్తిని ఇస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ UFS 2.1 వేరిఎంట్  సపోర్ట్ చేస్తుంది.  అయితే 256GB స్టోరేజ్ వేరియంట్లు వేగంగా UFS 3.0 సపోర్ట్ చేస్తాయి.

also read ఇక ఎయిర్‌టెల్ 3G సేవలు ఉండవ....?


కెమెరా విభాగంలో స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను ప్యాక్ చేస్తుంది. ఇది సోనీ IMX586 సెన్సార్, ఎఫ్ / 1.75 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రధాన స్నాపర్ ద్వారా హైలైట్ చేయబడింది. దీనికి 133 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 123-డిగ్రీల వీక్షణ క్షేత్రం, 8x మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సహాయంతో  షాట్లను దగ్గరగా తీసుకోవచ్చు.

ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇది 4-ఇన్ -1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని ప్రకాశవంతమైన ఫోటోలను అందించడానికి ఉపయోగిస్తుంది.స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 లోని కనెక్టివిటీ విషయంలో 4జి ఎల్‌టిఇ, బ్లూటూత్ వి 5.0, వై-ఫై ఎ / బి / జి / ఎన్ / ఎసి, జిపిఎస్, గ్లోనాస్, గెలీలియో మరియు వై-ఫై డైరెక్ట్ ఉన్నాయి.

బైట్ డాన్స్ బృందం నుండి వచ్చిన మొదటి ఫోన్ 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో క్విక్ ఛార్జ్ 4+ (18 డబ్ల్యూ) ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, పిడి 3.0 లకు తోడ్పడుతుంది. ఇది యుఎస్బి టైప్-సి ఛార్జర్ ద్వారా సౌకర్యవంతంగా ఉంటుంది. స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 యొక్క కొలతలు 156.6 x 74.38 x 7.8 మి.మీ ఈ ఫోన్ బరువు 185 గ్రాములు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios