Asianet News TeluguAsianet News Telugu

అద్వానంగా ఇండియన్ సైబర్ సెక్యూరిటీ.. 25% ఫోన్లు ఎఫెక్టెడ్


కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా అంటూ ఊరూవాడా ఊదరగొట్టినా.. అందులో భాగమైన సైబర్ సెక్యూరిటీలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నది. 60 దేశాల్లో పరిస్థితులను పోలిస్తే భారత్ 46వ ర్యాంకు పొందిందంటే సెబర్ సెక్యూరిటీ ఎంత అద్వాన్నంగా ఉందో అవగతమవుతోంది. 

Over a quarter of mobiles in India infected by malware: Cyber security study
Author
Delhi, First Published Feb 9, 2019, 2:43 PM IST

భారతదేశంలో సైబర్‌ సెక్యూరిటీ అధ్వాన్నంగా ఉన్నదని సెబర్‌ సెక్యూరిటీ స్టడీ ప్రకటించింది. దేశంలోని 25 శాతం ఫోన్లు, 21శాతం కంప్యూటర్లు మాలావేర్‌ బారీన పడుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. సైబర్ రక్షణ -సంబంధిత అప్‌డేటెడ్‌ చట్టాలు, మాలావేర్‌ ఎటాక్‌, సైబర్-దాడులకు సంసిద్ధత వంటి అంశాలపై  బ్రిటన్‌కు చెందిన టెక్నాలజీ పరిశోధనా సంస్థ కంపారిటెక్‌ 60 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియా 46వ స్థానంలో నిలిచింది. 

ప్రపంచంలోని అత్యంత సైబర్-సురక్షిత దేశంగా జపాన్ నిలిచింది. జపాన్ వంటి దేశంలో కేవలం 1.34 శాతం ఫోన్లు, 8 శాతం కంప్యూటర్లు మాత్రమే సెబర్‌ దాడులకు గురవుతున్నాయి సర్వే వెల్లడించింది. సైబర్‌ దాడులు నిరోధం, చట్టాలు వంటి అంశంలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లో మెరుగా ఉన్నదని తెలిపింది. 

ఈ జాబితాలో ఫ్రాన్స్‌, కెనడా, డెన్మార్క్‌, అమెరికా తరువాతి స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్, చైనా రెండూ సైబర్-సెక్యూరిటీలో అధ్వాన్నంగా ఉన్నా భారతదేశం మొత్తం స్కోరులో 39 శాతం సాధించిందని రిపోర్టు పేర్కొంది.  

సైబర్‌దాడులకు సంబంధించి ఈ జాబితాలో అల్జీరియా అట్టడుగున నిలిచింది.  అలాగే సరైన చట్టాలు, రక్షణ చర్యలు లేక ఇండోనేషియా, వియత్నం, టాంజానియా, ఉజ్బెకిస్తాన్‌ ఎక్కువ దాడులకు గురవుతున్నాయని  నివేదించింది. అల్జీరియాలో 23 శాతం మొబైల్ ఫోన్లు, 30 శాతం కంప్యూటర్లు మాల్ వేర్ బారీన పడుతున్నాయి. మన పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో 36 శాతం మొబైల్ ఫోన్లు సైబర్ దాడులకు గురవుతున్నాయి. 

ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కై లాబ్, సెంటర్ ఫర్ స్ట్రాటర్జిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తదితర సంస్థల నుంచి ఈ అధ్యయన సంస్థ సమాచారం అందుకున్నది.
 

Follow Us:
Download App:
  • android
  • ios