Asianet News TeluguAsianet News Telugu

ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకం: మైక్రోసాఫ్ట్ లాప్‌టాప్ రూ.38,599లకే లభ్యం

ఎట్టకేలకు భారతదేశ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో లాప్ టాప్ ప్రవేశించింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.38,599లకే అందుబాటులోకి రానున్నది.

Microsoft Surface Go finally arrives in India at Rs 38,599, available exclusively on Flipkart
Author
New Delhi, First Published Jan 2, 2019, 3:23 PM IST

 

న్యూఢిల్లీ: సర్ఫేస్ గో, మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా తయారు చేసిన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో లాప్‌టాప్ ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగిడింది. ఈ- కామర్స్ వేదిక ‘ఫ్లిప్‌కార్ట్’లో మాత్రమే ఎక్స్ క్లూజివ్ సేల్స్ ప్రారంభించింది. భారత్‌లో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో లాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొంటే రూ.38,599లకే లభిస్తుంది. కేవలం 522 గ్రాముల బరువు ఉండే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో లాప్‌టాప్.. ప్రత్యర్థి సంస్థలు ఆపిల్ ఐపాడ్ ప్రో, శామ్‌సంగ్ గ్యాలక్సీ టాబ్ ఎస్4 మోడల్ లాప్‌టాప్‌లకు పోటీగా నిలబడనున్నది. 

పది అంగుళాల నిడివితోపాటు టూ ఇన్ వన్ డివైజ్ 4జీబీ ర్యామ్‌తోపాటు 48 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజీ గల మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో లాప్‌టాప్ రూ.38,599లకు, 8జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల లాప్‌టాప్ రూ.50,999లకు లభిస్తుంది. 2018 ప్రారంభంలోనే మైక్రోసాఫ్ట్ తన సర్ఫేస్ గో లాప్‌టాప్ కంప్యూటర్‌ను వివిధ దేశాల మార్కెట్లోకి ఆవిష్కరించింది. 

ఏడో తరం ఇంటెల్ పెంటియం గోల్డ్ ప్రాసెసర్ 4415వై, గొరొల్లా గ్లాస్ 3తోపాటు తొమ్మిది గంటల పాటు పని చేసే బ్యాటరీ ఈ లాప్‌టాప్ సొంతం. స్టోరేజీ సామర్థ్యం పెంపొందించేందుకు వీడియో అండ్ చార్జింగ్, మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్, హెడ్ ఫోన్ జాక్, డేటా కోసం యూఎస్ బీ-3.1 వసతులు అందుబాటులో ఉన్నాయి. సర్ఫేస్ గో లో ఫీచర్లు 5-ఎంపీ హెచ్డీ కెమెరా, రేర్ ఆటో ఫోకస్ 8ఎంపీ హెచ్డీ కెమెరాలతోపాటు డ్యూయల్ మైక్రోఫోన్లు అమర్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios