Asianet News TeluguAsianet News Telugu

డౌన్‌లోడ్ సామ్రాట్ ‘జియో’.. ఎయిర్ టెల్ కంటే రెట్టింపు

జియో అంటేనే ఒక సంచలనం. 2016లో కేవలం 4జీ సర్వీసులతో ప్రస్థానం ప్రారంభించిన రిలయన్స్ జియో డేటా డౌన్‌లోడ్ చేసుకోవడంలో 2018లో అత్యంత వేగవంతమైన 4జీ టెలికం ఆపరేటర్ గా నిలిచింది. గత నెలలోనూ సెకన్‌కు 18.8ఎంబీపీఎస్ డేటా డౌన్‌లోడ్‌తో టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. 

Jio tops 4G download speed chart in January, Idea fastest in upload speed: Trai
Author
New Delhi, First Published Feb 16, 2019, 12:50 PM IST

న్యూఢిల్లీ: టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రియలన్స్‌ జియో దూకుడు కొనసాగుతూనే ఉన్నది. డేటా డౌన్‌లోడ్‌ వేగంలో రిలయన్స్ జియో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నది. గత 13 నెలలుగా డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియోనే మొదటి స్థానంలో ఉందని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) పేర్కొంది.

తాజాగా గత నెలలో ఒక సెకన్‌కు 18.8 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో జియో తొలి స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్‌ డౌన్‌లోడ్‌ వేగం కంటే ఇది రెట్టింపు. 

ఒక సెకన్‌కు 9.5 ఎంబీపీఎస్‌ వేగంతో ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంది. ఇక వొడాఫోన్‌ 6.7ఎంబీపీఎస్‌, ఐడియా 5.5ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌తో తర్వాతీ స్థానాల్లో ఉన్నాయి.

వినియోగదారులకు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సంస్థలు 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. రిలయన్స్ జియో కేవలం 4జీ సర్వీసులను మాత్రమే అందిస్తోంది.

ఇక అప్‌లోడ్‌ వేగంలో ఐడియా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నది. అక్టోబర్, డిసెంబర్ నెలల్లో వొడాఫోన్ ఐడియా అప్‌లోడ్‌ వేగం తగ్గినా జనవరిలో తిరిగి పుంజుకున్నది. ఐడియా అప్‌లోడ్‌ వేగం 5.8 ఎంబీపీఎస్‌ కాగా, వొడాఫోన్‌ 5.4ఎంబీపీఎస్‌తో రెండోస్థానంలో ఉంది.

ఆ తర్వాత జియో 4.4ఎంబీపీఎస్‌ వేగం, ఎయిర్‌టెల్‌ 3.8ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ వేగాన్ని నమోదు చేశాయి. 2018లో అత్యంత వేగమైన 4జీ ఆపరేటర్‌గా రిలయన్స్‌ జియో నిలిచింది. ట్రాయ్ రియల్ టైం బేసిస్‌పై ‘మై స్పీడ్’ అప్లికేషన్ ఆధారంగా ఈ డౌన్ లోడ్, అప్ లోడ్ డేటా, దాని స్పీడ్‌ను అంచనా వేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios