Asianet News TeluguAsianet News Telugu

‘జియో ఫోన్‌’కూ ‘ఆల్ ఇన్ వన్’ ప్రీపెయిడ్

ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం జియో ‘ఆల్‌  వన్‌ ప్లాన్‌’ తీసుకువచ్చి విజయాన్ని సాధించింది . రిలయన్స్‌ జియో తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి విభిన్న ప్రయోగాలు చేస్తోంది. ఇదే వ్యూహాన్ని జియో ఫోన్‌ విషయంలో కూడా అమలు చేస్తోంది. 

Jio Phone Users Get 'All-in-One' Prepaid Plans  for Jiophone
Author
Hyderabad, First Published Oct 26, 2019, 10:10 AM IST

ముంబై: రిలయన్స్‌ జియో తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి విభిన్న ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం ‘ఆల్‌  వన్‌ ప్లాన్‌’ తీసుకువచ్చి విజయాన్ని సాధించింది జియో. ఇదే వ్యూహాన్ని జియో ఫోన్‌ విషయంలో కూడా అమలు చేస్తోంది.

also read వివో నుంచి ఐక్యూ నియో విడుదల: అద్భుతమైన ఫీచర్లు

తాజాగా ఇండియా కా స్మార్ట్‌ఫోన్‌ జియోఫోన్‌ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆల్‌ ఇన్‌ వన్ మంత్లీ ప్లాన్‌లను ప్రారంభించింది. రూ. 75, రూ.125, రూ.185  విలువైన రీచార్జ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లు ప్రస్తుతం ఉన్న వాటికి అదనం. ఈ ప్లాన్లలో వరుసగా నెలకు 3జీబీ (రోజుకు 0.1 జీబీ), 14జీబీ,(రోజుకు 0.5 జీబీ), 28 జీబీ (రోజుకు 1 జీబీ), 56 జీబీ (రోజుకు 2జీబీ) డేటాలను అందిస్తుంది. అంతేకాదు ఉచిత 500 నిమిషాల నాన్-జియో వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఈ ప్లాన్స్‌లో అఫర్‌ చేస్తోంది. 

Jio Phone Users Get 'All-in-One' Prepaid Plans  for Jiophone

అలాగే అపరిమిత జియో-టు-జియో, ల్యాండ్‌లైన్ వాయిస్ కాల్‌లు కూడా ఉన్నాయి.రూ.125 ప్లాన్‌లో నెలకు 14జీబీ డేటా, 500 నాన్-జియో నిమిషాలు, 300 ఎస్సెమ్మెస్‌లు లభించనుండగా, రూ.155 ప్లాన్‌లో 28 జీబీ, 500 నాన్ జియో మినిట్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. రూ.185 ప్లాన్‌లో 56 జీబీ నెలవారీ డేటా, 500 నాన్-జియో మినిట్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అన్ని ప్లాన్లకు కాలపరిమితి 28 రోజులు. 

also read టెలికం ప్రొవైడర్లకు భారీ షాక్‌...

జియో ఫోన్ వినియోగదారుల కోసం తన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల ద్వారా ప్రత్యర్థుల కంటే 25 రెట్లు ఎక్కువ విలువను అందిస్తున్నామని జియో పేర్కొంది. ఇటీవల ఇంటర్‌ కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయూసీ) చార్జీలను జియో ప్రకటించింది. 

ఐయూసీ చార్జీలను చార్జీలు వసూలు చేయడంపై వినియోగదారులనుంచి నిరసన వ్యక్తం కావడంతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం ఆల్‌ ఇన్‌ వన్‌ మంత్లీ ప్లాన్లను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.225, రూ.555 ప్లాన్లు ఉన్నాయి. వీటిలో రోజుకు 2జీబీ డేటా, 3,000 నాన్-జియో వాయిస్ కాలింగ్ మినిట్స్ లభిస్తాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios