Asianet News TeluguAsianet News Telugu

భారత్ మరో రికార్డు: 56 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు

టెలికం రంగంలోకి రిలయన్స్ జియో రాకతో డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది

Internet access in India has crossed 50-crore milestone
Author
New Delhi, First Published Dec 30, 2018, 4:34 PM IST

న్యూఢిల్లీ: టెలికం రంగంలోకి రిలయన్స్ జియో రాకతో డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జియో రాకతో డేటా వినియోగం విషయంలో ఇతర టెలికాం సంస్థలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. కాగా, 2018లో భారత్‌లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు 65శాతం పెరిగాయని ట్రాయ్‌ గణాంకాల ద్వారా వెల్లడైంది. అంతేకాదు, ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య 50కోట్ల మార్కును దాటింది. సెప్టెంబరు 2018 చివరి నాటికి భారత్‌లో నారో బ్యాండ్‌, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు 56కోట్లకు చేరాయని ట్రాయ్‌ పేర్కొంది. 

ఇందులో 54కోట్ల మంది మొబైల్‌ ద్వారానే ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. మిగిలిన వాళ్లు బ్రాడ్‌ బ్యాండ్‌ వాడుతున్నారు. మొత్తం 56కోట్ల కనెక్షన్లలో 36కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 19.4కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారని ట్రాయ్‌ వెల్లడించింది. కాగా, 2018 ఆగస్టు 31 నాటికి 445.18మిలియన్ల మంది మొబైల్‌ఫోన్లు, డాంగిల్స్‌ ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నారు. మొత్తం ఐదు టెలికాం సంస్థలు ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి.


అత్యధికంగా జియో ఇన్ఫోకామ్‌(252.25మిలియన్లు), ఉండగా, ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్‌(99.29మిలియన్లు), వొడాఫోన్‌ (51.82మిలియన్లు), ఐడియా (47.90మిలియన్లు), బీఎస్‌ఎన్‌ఎల్ (20.12 మిలియన్లు) ఉన్నాయి. మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో అత్యధికంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్రల్లో 20కోట్లమంది ఉంది ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 76 శాతం పురోగతి నమోదు కాగా, గుజరాత్ రాష్ట్రంలో 71.4 శాతంగా రికార్డైంది. 

2016 మార్చి నెలాఖరు నాటికి కేవలం 34 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతుండగా, 2017 నాటికి అది 42 కోట్లకు చేరుకున్నది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకల్లా 49 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్ కల్లా అది 51 కోట్లకు పూర్తయింది. వచ్చే రెండు, మూడేళ్లలో ఇంటర్నెట్ వినియోగంలో చైనాతో సమానం అవుతామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. పలు టెలికం ప్రొవైడర్లు గ్రామీణ మార్కెట్ విస్తరణపై కేంద్రీకించాయి. అందులో భాగంగా మౌలిక వసతులకు ప్రాదాన్యం ఇస్తున్నాయి. పట్టణాల్లోనూ జియో రంగ ప్రవేశం చేసిన తర్వాతే ప్రజలంతా భారీగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios