Asianet News TeluguAsianet News Telugu

హానర్ వ్యూ 20 కొనుగోలుపై ఆఫర్లే ఆఫర్లు.. మీదే ఆలస్యం

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే సబ్ బ్రాండ్ హనర్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన హానర్ వ్యూ 20 మోడల్ కొనుగోలు చేసే వారికి పలు రకాల ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. అమెజాన్ ఆన్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. 

Honor View 20 goes on sale on Amazon today: Offers and specifications
Author
New Delhi, First Published Jan 30, 2019, 11:21 AM IST

హువావే బ్రాండ్‌ కింద హానర్‌ తన సరికొత్త మొబైల్‌ హానర్‌ వ్యూ 20ని భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ప్రత్యేకంగా అమెజాన్ ఆన్ లైన్ స్టోర్లలో బుధవారం నుంచి లభించనున్నది.

ప్రపంచంలోనే ఐఏ ఆధారిత 48 మెగా పిక్సెల్‌ భారీ కెమెరాతో వస్తున్న స్మార్ట్‌ఫోన్ అంటూ ఊరిస్తున్న హానర్‌ వీ 20ఎట్టకేలకు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 

ప్యారిస్‌లో జరిగిన ఈవెంట్‌లో హానర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. పంచ్ హోల్ డిస్‌ప్లే,  48 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతోపాటు 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ  ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.  

మిడ్‌నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ, ఫాంటమ్ బ్లూ, ఫాంటర్ రెడ్ రంగుల్లో రూపుదిద్దుకున్నదీ ఫోన్. అంతేకాదు రెండు వేరియొంట్లలో హానర్ వీ 20 ఫోన్ అందుబాటులో ఉంది. రూ.37,999లకు ప్రారంభమయ్యే ఈ ఫోన్ ధరపై హానర్ పలు రాయితీలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి ధరలో రూ.8,500 రాయితీ లభిస్తుంది. ఇక అదనంగా రిలయన్స్ జియో వినియోగదారులకు రూ.2,200 క్యాష్ బ్యాక్ ఆఫర్ తోపాటు 2.2 టీబీ డేటా కూడా లభిస్తుంది. 

2018 జనవరిలో తొలిసారి ‘మై జియో యాప్’ నుంచి రీ చార్జి చేసుకున్న వినియోగదారులకు రూ.50 విలువ గల 44 క్యాష్ బ్యాక్ ఓచర్లను అందజేస్తుంది. ఇక ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ ఈఎంఐ లావాదేవీలపై ఐదుశాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ కల్పిస్తుంది.

రూ.3000 విలువైన వస్తువులను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా, రూ. 10 వేల విలువైన వస్తువులను హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఈఎంఐ కాస్ట్ పడదు. అమెజాన్ పే బ్యాలన్స్ ద్వారా రెండు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అదనంగా లభిస్తుంది. 

6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ  ప్లస్‌ డిస్‌ప్లే గల హానర్ వీ20 ఫోన్ ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్, 1080x2310 పిక్సెల్స్ రిజల్యూషన్‌, ఆక్టాకోర్ కిరిన్ 980ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 6జీబీ కం 128 జీబీ నిల్వ సామర్థ్యం, 8జీబీ ర్యామ్ కం 256 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యం ఉంటుంది.

ఇక 48 మెగాపిక్సెల్  రియర్‌ కెమెరాతోపాటు 25 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా అమర్చారు. ఇక 7ఎన్ఎం మొబైల్ క్రుత్రిమ మేధస్సు (ఏఐ) చిప్ సెట్ తొలిసారి అమర్చారు. హానర్ వ్యూ 20 ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఎహెచ్. సూపర్ చార్జర్ సపోర్ట్ కూడా ఉంటుంది.

4జీ, ఓల్ట్, 3జీ, వై-ఫై సామర్థ్యంతోపాటు బ్లూ టూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ తదితర ఫీచర్లు ఇందులో సమకూర్చారు. ఆనర్ వ్యూ 20 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 37,999 కాగా, 8జీబీ ర్యామ్/256 స్టోరేజీ వేరియంట్ ధర రూ. 45,999. ఇందులో పాంథమ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్, షాపైర్ బ్లూ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.  ఫిబ్రవరి నుంచి రిలయన్స్ డిజిటల్‌ స్టోర్లలోనూ అందుబాటులోకి రానున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios