Asianet News TeluguAsianet News Telugu

ఫేస్ బుక్ స్పెషల్ ఫీచర్.. ప్రపంచమంతా అక్కడే

సోషల్ మీడియా  దిగ్గజం ఫేస్‌బుక్‌ మరోకొత్త  ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఫేక్‌న్యూస్‌కు చెక్‌ పెట్టాలని భావిస్తోన్న  ఫేస్‌బుక్‌  న్యూస్ ట్యాబ్' పేరుతో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.

Facebook launches a news section-and will pay publishers
Author
Hyderabad, First Published Oct 27, 2019, 5:31 PM IST

న్యూయార్క్‌: ప్రముఖ  ఫేస్‌బుక్‌ యాప్‌లో ప్రత్యేక వార్తా విభాగాన్ని ప్రవేశపెట్టింది. 'న్యూస్ ట్యాబ్' పేరుతో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.

తద్వారా తన ప్లాట్‌ఫాంలో ఫేక్‌న్యూస్‌కు చెక్‌ పెట్టాలని భావిస్తోంది.  కొంత కాలంగా ప్రయోగదశలో పరిశీలించిన ఈ ఫీచర్‌ను శుక్రవారం అమెరికాలో మాత్రమే అందుబాటుకి తెచ్చింది. భారత్ సహా ఇతర దేశాల్లో ఈ ఫీచర్‌ను త్వరలోనే  అందుబాటులోకి తేనుంది.

also read: జియో ఫోన్‌’కూ ‘ఆల్ ఇన్ వన్’ ప్రీపెయిడ్

న్యూయార్క్‌లో పాలే సెంటర్ ఫర్ మీడియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్ మాట్టాడుతూ, తొలిసారిగా తమ యాప్‌లో ప్రదర్శించే వార్తలకు పబ్లిషింగ్ కంపెనీలకు కొంత సొమ్మును చెల్లిస్తామని తెలిపారు.  అయిత ఫేస్‌బుక్‌లో తమ వార్తలకోసం ఆయా పబ్లిషర్లు  యాప్‌ లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి వుంటుందని పేర్కొన్నారు.

ఈ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ, జనరల్‌ న్యూస్‌తోపాటు వివిధ విభాగాలకు చెందిన వార్తలు ఫేస్‌బుక్ యూజర్లకు అందుబాటులో వుంటాయి. ప్రధానంగా వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఎన్‌బీసీ న్యూస్ , ఏబీసీ న్యూస్ తోపాటు, చికాగో ట్రిబ్యూన్ డల్లాస్ మార్నింగ్ న్యూస్ స్థానిక అవుట్లెట్లతో సహా సుమారు 200 మంది ప్రచురణకర్తల వార్తలు, విశేషాలు ఫేస్‌బుక్‌లో  చదువు కోవచ్చు. 

also read దీపావళి స్పెషల్: ట్విట్టర్ కొత్త ఎమోజిలు

ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడానికి, అసలైన రిపోర్టింగ్ ప్రాముఖ్యతను గుర్తించడానికి చాలా కష్టపడ్డామని ఫేస్‌బుక్‌ వార్తా భాగస్వామ్యాన్ని పర్యవేక్షించే కాంప్‌బెల్ బ్రౌన్ చెప్పారు. ఫేస్‌బుక్‌ వినియోగదారుడు ఎవరైనా సరే సంబంధిత వార్తను చదవాలంటే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.  దీంతో ఫేస్‌బుక్ నుంచి లింక్ నేరుగా పబ్లికేషన్ కు రీ-డైరెక్ట్ అవుతుంది. పాత్రికేయ వృత్తికి మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇస్తున్న గౌరవం గొప్పదని ఇప్పటికే పలు వార్తా పత్రికల అధినేతలు  జుకర్‌బర్గ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios