Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లోకి డెల్‌ కొత్త లాప్‌టాప్స్‌.. రూపీ భవితవ్యంపై ఆర్బీఐలో టెన్షన్

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ‘డెల్’ భారతీయ మార్కెట్లోకి రెండు మోడళ్ల కంప్యూటర్లను విడుదల చేసింది. 

Dell Inspiron 5480, 5580 laptops launched in India: Price, specifications, features
Author
New Delhi, First Published Dec 22, 2018, 10:23 AM IST

న్యూఢిల్లీ: డెల్‌ రెండు కొత్త లాప్‌టాప్ కంప్యూటర్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇన్సిపిరాన్‌ 5480, ఇన్సిపిరాన్‌ 5580 పేర్లతో తెచ్చిన ఈ లాప్‌టాప్‌ల ప్రారంభ ధర వరుసగా రూ.36,990, రూ.37,990గా ఉంది. వీటిలోని వేరియంట్ల ప్రారంభ బరువు 1.48 కిలోలు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, యాంటీ గ్లేర్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లేతోపాటు 8వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ టీఎం ఐ3, ఐ5, ఐ7 ప్రాసెసర్లతో కూడిన వేరియంట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 

ఈ లాప్‌టాప్ లు వ్యక్తిగత సినిమా థియేటర్‌ అనుభూతిని కల్పిస్తాయని తెలిపింది.
డెల్ ఇండియా కన్జూమర్ అండ్ స్మాల్ బిజినెస్ ప్రొడక్ట్ మార్కెటింగ్ డైరెక్టర్ అలెన్ జాయ్ జోస్ మాట్లాడుతూ తమ ఉత్పత్తులతో లభించే ప్రయోజనాలతో పర్సనల్ కంప్యూటర్ల వినియోగదారులు వీటి సేవలను ప్రశంసిస్తారన్నారు. ఈ లాప్ టాప్‌లో సూక్ష్మీకరించిన నాలుగు లెన్స్ తో కూడిన వెబ్ కామ్ ను 14 అంగుళాల ఆప్షన్ పై వినియోగించుకోవచ్చునని కంపెనీ తెలిపింది. 

మారకపు నిల్వలు సరిపోతాయా?: ఆర్బీఐ ఆందోళన
అక్టోబర్ నెలలో రికార్డు కనిష్ఠాలకు చేరిన రూపాయి మారక విలువ ఇపుడిపుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో మన వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలు ఏవైనా తక్షణ షాక్‌లను తట్టుకోగలవా అని ఆర్బీఐ మదింపు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివిధ అంతర్జాతీయ, దేశీయ అంశాలతో మే నుంచి అక్టోబరు మధ్య రూపాయి క్షీణించినప్పుడు భారత కరెన్సీకి మద్దతునిచ్చేందు కోసం నికరంగా 23.44 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలను ఆర్బీఐ విక్రయించింది. ‘ప్రస్తుత స్థాయిల వద్ద నిల్వలు సరిపోతాయా? లేదా? అన్నదే ఆర్బీఐకి ప్రశ్నగా ఉంద’ని ఆ వర్గాలు అంటున్నాయి. 

ప్రభుత్వం, ఆర్బీఐ సెప్టెంబర్ నెల మధ్య నుంచి చర్యలు తీసుకున్నా.. ఆ సమయంలో పలు కీలక మద్దతు స్థాయిలను రూపాయి కోల్పోయింది. కేవలం విదేశీ మారక మార్కెట్‌ జోక్యమే సహాయపడిందని ఈ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అక్టోబర్ 11న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు కనిష్ఠ స్థాయి 74.4825కు చేరింది. అప్పటి నుంచి 6.56 శాతం మేర రికవరై బుధవారం 70.4 వద్ద ముగిసింది. తిరిగి శుక్రవారం కొంత నష్టపోయింది. 

ఆర్‌బీఐ ఇప్పటికే విదేశీ ఎక్స్ఛేంజీ మార్కెట్లో డాలర్లను కొంటూ తన నిల్వలను ఇపుడిపుడే బలోపేతం చేస్తోంది. నవంబరు 30 నాటికి భారత విదేశీ మారకపు నిల్వలు 393.72 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. ఏప్రిల్‌ 13న ఇవి రికార్డు గరిష్ఠమైన 426.08 బిలియన్‌ డాలర్లను తాకిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ అంచనాల ప్రకారం.. 400.5 బి. డాలర్లు(సెప్టెంబరు చివరి నాటి నిల్వలు) 10 నెలల పాటు దిగుమతులకు సరిపోతాయి. 
ఆర్‌బీఐ మంగళవారం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల నుంచి ఆర్బీఐ రూ.50 వేల కోట్ల బాండ్లను కొనుగోలు చేయనున్నది. అంతక్రితం ఇది రూ.40000 కోట్లుగానే ఉంది. అదే సమయంలో మార్చి దాకా రూ.50,000 కోట్లు చొప్పున కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద మారక నిల్వలను పెంచుకుని ఏవైనా సంక్షోభాలు వస్తే తట్టుకునేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios