Asianet News TeluguAsianet News Telugu

టెలికం ప్రొవైడర్లకు భారీ షాక్‌...

టెలికం ప్రొవైడర్లపై పిడుగు పడింది. ఏజీఆర్‌ ఫీజుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. వడ్డీతోపాటు జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ముగిసినట్లయింది. 
 

big shock :Huge setback for telecomm providers as Supreme Court asks them to pay Rs 92,000 cr to govt
Author
Hyderabad, First Published Oct 25, 2019, 2:44 PM IST

న్యూఢిల్లీ: భారతీయ టెలికం కంపెనీలకు భారీ షాక్‌​ తగిలింది.  చార్జీల వసూలుపై సుప్రీంకోర్టు కేంద్రానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్‌) నిర్దేశించిన అడ్జెస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ ( ఏజీఆర్‌\) నిర్వచనాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.  

దీనికి డాట్‌ విధించిన జరిమానాను వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. టెల్కోలు లేవనెత్తిన అంశాలు పనికిరానివని కొట్టి పారేసింది. సదరు ఏజీఆర్‌పై వడ్డీతో సహా జరిమానా చెల్లించాలని జస్టిస్‌లు అరుణ్‌ మిశ్రా, ఏఏ నజీర్‌, ఎంఆర్‌షాలతోకూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. 

also read వచ్చేనెలలో... రియల్ మీ ఎక్స్ 2 ప్రో

దీంతో ఏజీఆర్‌ ఫీజుపై మొబైల్‌ ఆపరేటర్లు, ప్రభుత్వానికి మధ్య సాగిన 14 ఏళ్ల న్యాయ పోరాటం ముగిసింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి రూ .92,642 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది, 

అందులో సగానికి పైగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ చెల్లించాల్సి ఉంది. డాట్‌ లెక్కల ప్రకారం భారతీ ఎయిర్‌టెల్ రూ .21,682 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ.28,309 కోట్లు, ఎం​టీఎన్​ఎల్​ రూ.2,537 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

also read యమహా నుంచి రెండు కొత్త సౌండ్ బార్స్

డాట్‌ రూల్స్‌‌ ప్రకారం అడ్జెస్టెట్‌ గ్రాస్‌ రెవెన్యూ (ఏజీఆర్‌) లో 8 శాతం లైసెన్సు ఫీజుగా చెల్లించాలి. ఏజీఆర్‌ స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్సింగ్ ఫీజులుగా విభజించారు. 5 శాతం ఎస్‌యూసీతోపాటు ఎక్కువ స్పెక్ట్రాన్ని సేకరించిన మొబైల్‌ సంస్థ ఓటీఎస్‌సీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో సర్కిల్‌‌లో 4.4 మెగాహెర్ట్జ్‌ల కంటే ఎక్కువ స్పెక్ట్రం ఉన్నా మార్కెట్‌ ధరలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios