Asianet News TeluguAsianet News Telugu

రేపు మార్కెట్లోకి అసుస్ స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణ

తైవాన్‌ టెక్‌ దిగ్గజం ఆసుస్‌ డిసెంబర్‌ 11న రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్‌లోకి తెచ్చిన ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎమ్‌1 కి కొనసాగింపుగా జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎమ్‌2ను నాచ్‌ డిజైన్‌తో తీసుకురానున్నది. 

ASUS teases Zenfone Max M2, Max Pro M2 specifications before 11th December launch
Author
New Delhi, First Published Dec 10, 2018, 4:20 PM IST

న్యూఢిల్లీ: తైవాన్‌ టెక్‌ దిగ్గజం ఆసుస్‌ డిసెంబర్‌ 11న రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్‌లోకి తెచ్చిన ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎమ్‌1 కి కొనసాగింపుగా జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎమ్‌2ను నాచ్‌ డిజైన్‌తో తీసుకురానున్నది. ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌ద్వారా డిసెంబర్‌ 11న మధ్యాహ్నం 12:30 గంటలకు ఆవిష్కరించనున్నది. దీనితోపాటే సర్‌ప్రైజ్‌ లాంచ్‌గా జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎమ్‌2ని కూడా రిలీజ్‌ చేయనున్నది.

ఇవీ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రొ ఎమ్‌2 ఫీచర్లు
6.3 అంగుళాల డిస్‌ప్లేతో 2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్‌ కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ అమర్చారు. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక 12+5 ఎంపీ  డ్యూయల్ రియర్‌ కెమెరాలతోపాటు 13 ఎంపీ సెల్పీ  కెమెరా కూడా అమర్చారు. దీనికి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉన్నది. జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రొ ఎమ్‌2 ధర  దాదాపు రూ.19,100 ఉంటుందని భావిస్తున్నారు. 

జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎమ్‌2 ఫీచర్లు ఇలా:
జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎమ్‌2 ఫోన్ 6.3 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతోపాటు 2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్‌ కలిగి ఉంటుంది. దీనికి తోడు స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ అమర్చారు. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. ఇక వినియోగదారుల సౌకర్యార్థం 3+2 ఎంపీ  డ్యూయల్ రియర్‌ కెమెరాలతోపాటు 8 ఎంపీ సెల్పీ  కెమెరా అమర్చారు. దీనికి 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ధర దాదాపు రూ. 13,800 ఉంటుంది. 

కొత్త ఏడాదిలో భారీగా ఉద్యోగాలు : మెర్సర్‌
నూతన సంవత్సరంలో ఉద్యోగ నియామాకాలు ఊపందుకోనున్నాయని మానవ వనరుల (హెచ్‌ఆర్‌) సంస్థ మెర్సర్‌ వెల్లడించింది. 2019లో 50 శాతానికి పైగా కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నాయని, కేవలం 3 శాతం సంస్థలు మాత్రమే ఉద్యోగుల సంఖ్యను తగ్గిచుకోనున్నట్లు చెప్పాయని మెర్సర్‌ ఇండియా బిజినెస్‌ లీడర్‌ శాంతి నరేశ్‌ తెలిపారు. గత కొన్నేళ్లుగా కంపెనీల్లో హైరింగ్‌ ట్రెండ్‌ మెరుగ్గా ఉందని, కొత్త ఏడాదిలో కూడా నియామకాలు సానుకూలంగా ఉండనున్నాయని మెర్సర్‌ ఇండియా సీఈఓ అనీశ్‌ సర్కార్‌ తెలిపారు. సేల్స్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (ఆర్‌ అండ్‌ డీ)లో అవకాశాలు భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios