Asianet News TeluguAsianet News Telugu

తగ్గిన ఆపిల్ ఆదాయం అంచనాలు.. టిమ్‌కుక్ ఆందోళన

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆందోళన.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐ ఫోన్ విక్రయాలు తగ్గి హాలీడే త్రైమాసికంలో ఆదాయం తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా చైనా మార్కెట్ మందగమనంగా సాగడంపై ఆందోళన కనబరిచారు. 

Apple CEO Tim Cooks memo to employees about iPhone sales
Author
Washington, First Published Jan 4, 2019, 9:24 AM IST

చైనాలో మందగమనం ఆపిల్ ఆదాయ అంచనాల కోతకు దారి తీసింది. యాపిల్ ఆదాయ అంచనాల కోత ప్రపంచ మార్కెట్ల నష్టాలకు దారితీసింది. ఐఫోన్లు తయారు చేసే యాపిల్ కంపెనీ ఈ ఏడాది తొలి క్వార్టర్ ఆదాయ అంచనాలను తగ్గించింది.

తమ ఆదాయం 9,100 కోట్ల డాలర్ల నుంచి 8,400 కోట్ల డాలర్లకు తగ్గుతుందని యాపిల్ అంచనా వేసింది. చైనా, వర్ధమాన దేశాల్లో ఆర్థిక క్షీణత అంచనాల కంటే అధికంగా ఉండటంతో ఆపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఆపిల్ కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ గ్యాడ్జెట్ల అమ్మకాలు తగ్గుతాయని ఆపిల్ ఆందోళన వ్యక్తం చేఃసింది. బుధవారం మార్కెట్ ముగిసిన తర్వాత కోత అంచనాలను ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు.

టెక్ దిగ్గజం ‘ఆపిల్’ సీఈఓ టిమ్ కుక్ తొలిసారి తన అసంత్రుప్తిని, నిరాశను బయట పెట్టారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తోలిసారి రెవెన్యూ అంచనాల ఔట్‌లుక్‌లో కోత విధించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ మేరకు సంస్థ సిబ్బందికి లేఖ రాశారు. హాలీడే త్రైమాసికంలోనూ ‘ఐ ఫోన్’ విక్రయాలు ఊహించినదానికంటే తక్కువగా అమ్ముడు పోవడంతో తాను నిరాశకు గురయ్యానని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇందుకు తాను బహిర్గత అంశాలను తప్పుబట్టబోవడం లేదని కూడా తెలిపారు. సూక్ష్మ, ఆర్థిక పరిస్థితులతోపాటు ఆపిల్, స్మార్ట్ ఫోన్ పరిశ్రమకు కొన్ని సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.

కానీ కంపెనీ సీఈఓగా స్మార్ట్ ఫోన్లు, మాక్ కంప్యూటర్ల వ్యాపారంలో తమ సంస్థ సేవలకు గాను రెవెన్యూ అంచనాలు సిద్ధం చేశామన్నారు. గురువారం సమావేశానికి హాజరు కాలేకపోయిన సిబ్బంది కూడా వారి ద్రుష్టికి వచ్చిన అంశాలు, సమస్యలను లేవనెత్తాలని సూచించారు. 

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఉల్లాసంగా గడిపారని ఆకాంక్షిస్తూ లేఖ రాసిన టిమ్ కుక్.. ఆపిల్ ఇన్వెస్టర్లకు రాసిన ఈ లేఖను చదువాలని ప్రోత్సహిస్తున్నానన్నారు.

తొలి త్రైమాసికంలో ప్రత్యేకించి హాలీడే సీజన్‌లో ‘ఐఫోన్’ విక్రయాలతో మరీ ప్రాథమికంగా గ్రేటర్ చైనా మార్కెట్ నుంచి ఆదాయం తగ్గుముఖం పట్టిందని గుర్తు చేశారు. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో మాక్ ఐపాడ్ రెవెన్యూ డబుల్ డిజిట్స్ దాటిందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ గుర్తు చేశారు.

ఈ ఏడాది తొలిసారి విక్రయాలతోపాటు త్రైమాసికం ఆదాయ లక్ష్యాలు పడిపోవడంతో వివిధ సర్వీసుల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా నిర్దేశించిందని తెలిపారు. హాలీడే సీజన్ సందర్భంగా గతేడాది క్రిస్మస్ డే నాడు అమెరికాతోపాటు కెనడా దేశాల్లో ఐఫోన్ విక్రయాలు రికార్డులు నెలకొల్పాయి.

ఈ సారి క్రిస్మస్ డే సందర్భంగా అమెరికా, కెనడా, మెక్సికో, జర్మనీ, ఇటలీతోపాటు ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు, ఆసియా-పసిఫిక్ రీజియన్ పరిధిలోని దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల నుంచి వచ్చే ఆదాయంలో సరికొత్త రికార్డు నెలకొల్పగలమని అంచనా వేశామని టిమ్ కుక్ పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందిస్తూ, వారి ప్రశంసలు అందుకున్నామని గుర్తుచేశారు. ఐఫోన్ వినియోగదారులకు వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నందుకు గర్వంగా ఉండేదని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు.

తమ సంస్థ తయారు చేస్తున్న ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ ఎస్ మాక్స్ వంటి మోడల్ ఫోన్లతో ఏ ఫోన్లూ సాటి రావని పేర్కొన్నారు. సేల్స్ తగ్గిపోవడానికి బహిర్గత అంశాలను సాకుగా చూపొద్దని కోరారు.

‘ఆపిల్’ మిషన్ ను చేరుకునేందుకు మన సిబ్బంది వారి శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించడంపై కేంద్రీకరించాలని టిమ్ కుక్ సూచించారు. సవాళ్లతో కూడిన సమయంలోనూ ‘ఆపిల్’ సంస్థను తిరుగులేని సంస్థగా ఎల్లవేళలా తీర్చిదిద్దాలని టిమ్ కుక్ పేర్కొన్నారు. 

హువావే ఉపాధ్యక్షురాలు వాంగ్ మెంగ్ ఝూను కెనడా అరెస్ట్ చేసిన తర్వాత.. ఆమెకు మద్దతుగా హువావే మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై చైనా సంస్థలు తమ సిబ్బందికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆపిల్ ‘ఐఫోన్’ కల వారిపై దాని విలువ మేరకు జరిమానాలు కూడా విధించాయి ఆ సంస్థలు. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగడం కూడా దీనికి కారణం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios