Asianet News TeluguAsianet News Telugu

ఇండియాపై రికార్డు సాధించిన విండీస్ బ్యాట్స్ మన్

హెట్ మెయిర్ మరో రికార్డు కూడా సాధించాడు. వెస్టిండీస్ తరఫున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్సుల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు నెలకొల్పాడు.

West Indies batsman Hetmyer record on India
Author
Guwahati, First Published Oct 21, 2018, 8:27 PM IST

గౌహతి: భారత్ పై జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో వెస్టిండీస్ బ్యాట్స్ మన్ హెట్ మెయిర్ రికార్డు సాధించాడు. భారత్ బౌలర్లపై అతను చెలరేగి ఆడాడు. 74 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్స్ లతో సెంచరీ సాధించాడు. దీంతో అత్యంత వేగంగా భారత్ పై సెంచరీ సాధించిన నాలుగో విండీస్ బ్యాట్స్ మన్ గా అతను రికార్డు సాధించాడు. 

ఆ జాబితాలో 72 బంతుల్లో సెంచరీ చేసి వివియన్ రిచర్డ్స్ తొలి స్థానంలో ఉన్నాడు. రికార్డో పావెల్ కూడా 72 బంతుల్లోనే సెంచరీ చేసి రెండో స్థానంలో నిలిచాడు. శామ్యూల్స్ 73 బుంతల్లో సెంచరీ చేశాడు. హెట్ మెయిర్ 74 బంతుల్లో సెంచరీ చేశాడు. 

దాంతో పాటు హెట్ మెయిర్ మరో రికార్డు కూడా సాధించాడు. వెస్టిండీస్ తరఫున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్సుల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు నెలకొల్పాడు. 

13 ఇన్నింగ్సులో ఆడి హెట్ మెయిర్ మూడు సెంచరీలు చేయగా వివియన్ రిచర్డ్స్ 16, గ్రీనిడ్జ్ 27, సిమన్స్ 41 ఇన్నింగ్స్ ల్లో మూడు సెంచరీలు చేశారు. హెట్ మెయిర్ కు భారత్ తో ఇది తొలి వన్డే కావడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios