Asianet News TeluguAsianet News Telugu

వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కోహ్లీ...ఎందుకలా అన్నానంటే...

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అభిమానిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. అభిమాని చేసిన ట్వీట్ ను కోహ్లీ స్పోర్టివ్ గా తీసుకోకుండా హెచ్చరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ వ్యాఖ్యలను మాజీ ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక నెటిజన్లు వివిధ పద్దతుల్లో కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు. దీంతో వివాదాస్పదమవుతున్న ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోహ్లీ ప్రయత్నించాడు. దీంతో ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశాడన్న దానిపై కోహ్లీ ట్విట్టర్ వేదికన వివరణ ఇచ్చాడు.  

virat kohli respond  about his comments
Author
New Delhi, First Published Nov 9, 2018, 7:20 PM IST

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అభిమానిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. అభిమాని చేసిన ట్వీట్ ను కోహ్లీ స్పోర్టివ్ గా తీసుకోకుండా హెచ్చరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ వ్యాఖ్యలను మాజీ ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక నెటిజన్లు వివిధ పద్దతుల్లో కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు. దీంతో వివాదాస్పదమవుతున్న ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోహ్లీ ప్రయత్నించాడు. దీంతో ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశాడన్న దానిపై కోహ్లీ ట్విట్టర్ వేదికన వివరణ ఇచ్చాడు.  

ఈ భారతీయులు అంటూ సదరు అభిమాని చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రమే తాను స్పందించినట్లు కోహ్లీ తెలిపాడు. అంతేకాని తన ఆటతీరు గురించి చేసిన కామెంట్ పై మాత్రం కాదని కోహ్లీ అన్నారు. అయినా తనపై ఇలాంటి కామెంట్లు రావడం ఇదేమీ కొత్తకాదని పేర్కొన్నారు. ఇక ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేసి హాయిగా పండగ వాతావరణాన్ని ఆస్వాదించండి అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. 

ఈ వివాదారనికి కారణమైన అభిమాని ట్వీట్ ఇలా ఉంది.  ‘‘ నా దృష్టిలో మీరు అంత గొప్ప బ్యాట్స్‌మెన్ ఏం కాదు.... మీ కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల బ్యాటింగ్ చూడటానికి ఎక్కువ ఇష్టపడతాను..'' అనవసరంగా కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నారని అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనికి స్పందించిన విరాట్.. '' అలా అయితే నువ్వు భారతదేశంలో ఉండటం అనవసరం.. ఈ దేశంలో ఉంటూ పరాయి దేశం వారిని పొగిడేవారు అక్కడికే వెళ్లిపోవచ్చు కదా.. నేను నీకు నచ్చకపోయినా పర్వాలేదు.. కానీ నువ్వు మాత్రం భారత్‌లో ఉండకూడదు అనేది నా అభిప్రాయం..'' అంటూ ఘాటుగా బదులిచ్చాడు. అయితే ఈ వీడియోపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో కోహ్లీ మళ్లీ వివరణ ఇచ్చాడు.

మరిన్ని వార్తలు
 
కోహ్లీ అన్నదాంట్లో తప్పేముంది..? మద్దతుగా నిలిచిన కైఫ్  

వరల్డ్ కప్ కోసం కోహ్లీ ప్రతిపాదన.... వ్యతిరేకించిన రోహిత్

ఫ్యాన్ పై వ్యాఖ్య: చిక్కుల్లో పడిన కోహ్లీ

కోహ్లీవి చెత్త కామెంట్స్.. హీరో సిద్దార్థ్ ఫైర్!

కోహ్లీ పార్టీ ఇవ్వలేదని అలిగి ట్రైన్ ఎక్కిన రవిశాస్త్రి.. నెట్టింట మీమ్స్

అజారుద్దీన్ పై గంభీర్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు

కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ వన్.....

అజారుద్దిన్ ఓ మ్యాచ్ ఫిక్సర్...అతడితో బెల్ కొట్టిస్తారా- బిసిసిఐపై గంభీర్ గరం

‘‘ఇతన్ని పుట్టించినందుకు థ్యాంక్స్ దేవుడా’’...అనుష్క ట్వీట్

అంబటి రాయుడు సంచలన నిర్ణయం

రిషబ్ పంత్ కోసమే.. ధోనీ అలా చేశాడు.. కోహ్లీ

Follow Us:
Download App:
  • android
  • ios