Asianet News TeluguAsianet News Telugu

లిటిల్ మాస్టర్‌‌కు ఈ రోజు మెమొరబుల్ డే..ఎందుకంటే..

భారతదేశంలో క్రికెట్ ఒక మతమైతే.. సచిన్ క్రికెట్ గాడ్.. దేశంలో క్రికెట్ ఎదుగుదలలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. పది, పదిహేనేళ్ల కిందట కేవలం సచిన్ బ్యాటింగ్ చూడటానికే స్టేడియాలకు వచ్చేవారంటే అది అతిశయోక్తి కాదు.

today very special day for sachin tendulkar
Author
Mumbai, First Published Nov 15, 2018, 2:01 PM IST

భారతదేశంలో క్రికెట్ ఒక మతమైతే.. సచిన్ క్రికెట్ గాడ్.. దేశంలో క్రికెట్ ఎదుగుదలలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. పది, పదిహేనేళ్ల కిందట కేవలం సచిన్ బ్యాటింగ్ చూడటానికే స్టేడియాలకు వచ్చేవారంటే అది అతిశయోక్తి కాదు.

రెండున్నర దశాబ్ధాలకు పైగా తన జీవితాన్ని క్రికెట్‌కే అంకితం చేశారు సచిన్. సరిగ్గా 29 ఏళ్ల క్రితం అంటే 1989 నవంబర్ 15న ఆయన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. కకరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహంచాడు.

16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్.. అతి పిన్న వయస్సులో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటికీ ఆ రికార్డు సచిన్ పేరిటే ఉంది. టెస్టులు, వన్డేలు కలిపి వంద సెంచరీలు నమోదు చేసిన తొలి, ఏకైక క్రికెటర్‌గా... వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా...టెస్టులు, వన్డేల్లో 30 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌‌గా అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 24 ఏళ్ల సుధీర్ఘ కెరీర్‌ను 2013లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ముగించాడు. క్రికెట్‌కు సచిన్ అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్ననిచ్చి గౌరవించింది. తాను క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోజును గుర్తు చేసుకున్న టెండూల్కర్... భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తానని పేర్కొన్నాడు. 

మళ్లీ చిక్కుల్లో మొహమ్మద్ షమీ... అరెస్ట్ వారెంట్ తప్పదా..?

కాశ్మీర్‌పై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

ఆసిస్ బౌలర్ కి అరుదైన జబ్బు.. ఆటకు గుడ్ బై

టీ20లలో మిథాలీ రాజ్ సంచలనం.. రోహిత్ రికార్డు బద్ధలు

కోహ్లీలో నిగ్రహం లేదు.. నోరు జారుతున్నాడు: విశ్వనాథన్ ఆనంద్

ధోనీతో సరితూగే కీపర్....ఈ పదేళ్లలో అతడే నెంబర్‌వన్: గంగూలి

రోహిత్ శర్మను అధిగమించిన ధావన్... కోహ్లీ తర్వాత అతడే

200 ఫోర్లు కొట్టిన వీరుడిగా రోహిత్ శర్మ

సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించడం అసాధ్యం: సెహ్వాగ్

ఫ్యాన్ పై వ్యాఖ్య: చిక్కుల్లో పడిన కోహ్లీ

 

Follow Us:
Download App:
  • android
  • ios