Asianet News TeluguAsianet News Telugu

పాండ్యా తల దించుకున్నా అద్భుతం చేశాడు: కోహ్లీ

మహిళలపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్నాళ్లు టీంఇండియాకు దూరంగా వున్న యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇలా తన బౌలింగ్ తోనే కాదు అద్భుతమైన ఫీల్డింగ్ తో టీంఇండియా విజయంలో పాండ్యా కీలకంగా వ్యవహరించాడు. దీంతో పాండ్యాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. 

team india captain virat kohli praises hardik pandya
Author
Mount Maunganui, First Published Jan 28, 2019, 8:47 PM IST

మహిళలపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్నాళ్లు టీంఇండియాకు దూరంగా వున్న యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇలా తన బౌలింగ్ తోనే కాదు అద్భుతమైన ఫీల్డింగ్ తో టీంఇండియా విజయంలో పాండ్యా కీలకంగా వ్యవహరించాడు. దీంతో పాండ్యాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. 

మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ...హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ రాకతో జట్టు సమతూకంగా మారిందన్నాడు. అతడి రాక జట్టు సభ్యులందరికి  సంతోషాన్నిచ్చిందన్నాడు. గతంలో జరిగిన వివాదం కారణంగా మైదానంలో అతడు తలదించుకుని వున్నా...విజయానికి కావాల్సిందేమిటో గుర్తించాడని పేర్కొన్నాడు. అందువల్లే కివీస్ మిడిల్ ఆర్ఢర్ ఆటగాళ్లిద్దరిని పెవిలియన్ కు పంపించడమే కాదు... తన అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడని కోహ్లీ ప్రశంసించాడు.  

 కాఫీ విత్ కరణ్ షో కార్యక్రమంలో హార్ధిక్ పాండ్యా మహిళలను కించపర్చేలా మాట్లాడుతూ వివాదంలో చిక్కుకున్నాడు. తన వ్యక్తిగత లైంగిక వ్యవహారాల గురించి కూడా కాస్త అసభ్యకరంగా మాట్లాడి క్రికెట్ అభిమానులు, ప్రజలు,మహిళల ఆగ్రహానికి గురయ్యాడు. అంతేకాకుండా హార్ధిక్, రాహుల్ ఇద్దరిపై బిసిసిఐ రెండు వన్డేల నిషేదాన్ని విధించింది.  

తాజాగా వీరిద్దరిపై బిసిసిఐ సస్పెన్షన్ ఎత్తివేసింది. దీంతో ఇవాళ మౌంట్ మాంగనూయిలో జరిగిన మూడో వన్డేలో పాండ్యా బరిలోకి దిగాడు.  ఈ వివాదం కారణంగా తీవ్ర ఒత్తిడిగా వున్నట్లు కనిపించినా జట్టుపై ఆ ప్రభావం పడకుండా పాండ్యా జాగ్రత్తపడి విమర్శకుల నుండి కూడా ప్రశంసలను పొందుతున్నాడు.   

సంబంధిత వార్తలు 

బిగ్ రిలీఫ్: రాహుల్, పాండ్యాలపై సస్పెన్షన్ ఎత్తివేత

పాండ్యా వివాదంపై మొదటిసారి స్పందించిన కరణ్ జోహర్...

హర్దిక్ పాండ్యాకు మరో షాక్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

 

Follow Us:
Download App:
  • android
  • ios