Asianet News TeluguAsianet News Telugu

బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోని షమి.. చెప్పిందేంటి..? చేసిందేంటీ..?

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి ప్రస్తుతం కొన్ని రోజుల ప్రాక్టీస్ కోసమని రంజీల్లో ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ను కేవలం ప్రాక్టీస్ వరకే పరిమితం చేయాలని.. షమిపై అదనపు పనిభారం వేయరాదంటూ బీసీసీఐ ముందుగానే బెంగాల్ జట్టుకు కొన్ని సూచనలు చేసింది. అయితే వాటిని షమి పట్టించుకోవడం లేదు..

team india bowler mohammed shami over looks bcci instructions
Author
Kolkata, First Published Nov 22, 2018, 3:48 PM IST

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి ప్రస్తుతం కొన్ని రోజుల ప్రాక్టీస్ కోసమని రంజీల్లో ఆడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ను కేవలం ప్రాక్టీస్ వరకే పరిమితం చేయాలని.. షమిపై అదనపు పనిభారం వేయరాదంటూ బీసీసీఐ ముందుగానే బెంగాల్ జట్టుకు కొన్ని సూచనలు చేసింది.

అయితే వాటిని షమి పట్టించుకోవడం లేదు.. డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో షమి కూడా ఉన్నాడు. టీమిండియాలోని పేస్ విభాగానికి అతని అవసరం చాలా వుంది.

దీనిని గుర్తించిన బీసీసీఐ రంజీల్లో షమి చేత కేవలం 15-17 ఓవర్లకు మించి బౌలింగ్ చేయించరాదంటూ బెంగాల్ జట్టును ఆదేశించింది. అయితే కోల్‌కతాలో మంగళవారం నుంచి కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ ఏకంగా 26 ఓవర్లు బౌలింగ్ చేయడం బీసీసీఐని ఆగ్రహానికి గురిచేసింది.

ఈ విషయమై షమి మాట్లాడుతూ.. 26 ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల తాను ఎక్కడా ఇబ్బందికి గురికాలేదన్నాడు. పిచ్ బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తుండటంతో మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

పైగా రాష్ట్ర జట్టుకు ఆడుతున్నప్పుడు కచ్చితంగా మన బాధ్యతలను నిర్వర్తించాలని తన వైఖరిని సమర్ధించుకున్నాడు. మరోవైపు షమి తన ఇష్టంతోనే అదనపు ఓవర్లు బౌలింగ్ చేశాడని బెంగాల్ కోచ్.. బీసీసీఐకి తెలిపాడు. 

కోహ్లీ రికార్డుకి బ్రేకులు వేసిన శిఖర్ ధావన్

గ్రౌండ్‌లోనే కాదు... కోర్టులోనూ పాక్‌పై మనదే గెలుపు

ధోనీ ఔట్: ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే..

విరాట్ కోహ్లీపై బిషన్ సింగ్ విమర్శలు

ధోనీ 20ఏళ్ల కుర్రాడు అనుకున్నారా.. కపిల్ దేవ్ కామెంట్స్

‘‘కశ్మీర్ పాకిస్తాన్‌‌దే’’...మాట మార్చిన అఫ్రిది

రోహిత్‌,కోహ్లీలను వెనక్కినెట్టిన మిథాలీ...ఇప్పుడు గప్టిల్ ను కూడా...

మళ్లీ చిక్కుల్లో మొహమ్మద్ షమీ... అరెస్ట్ వారెంట్ తప్పదా..?

200 ఫోర్లు కొట్టిన వీరుడిగా రోహిత్ శర్మ

కోహ్లీ కుర్రాడు...అందువల్లే ఆ దూకుడు: బాలీవుడ్ డైరెక్టర్ సపోర్ట్

Follow Us:
Download App:
  • android
  • ios