Asianet News TeluguAsianet News Telugu

టీ 20: భయపెట్టిన విండీస్ బౌలర్లు, కష్టపడి గెలిచిన ఇండియా

కోల్ కతా ఈడెన్ గార్జెన్ లో జరుగుతున్న ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ కాకుండా రోహిత్ శర్మ ఇండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. భారత్  తరఫున కృణాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్ అంతర్జాతీ పొట్టి క్రికెట్ లో ఆరంగేట్రం చేస్తున్నారు. 

t20: India vs West Indies match updates
Author
Kolkata, First Published Nov 4, 2018, 6:47 PM IST

వెస్టిండీస్ పై కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో భారత్ కష్టపడి విజయం సాధించింది. ఒకానొక సందర్భంలో వెస్టిండీస్ బౌలర్లు భారత్ ను వణికించారు. అతి కష్టం మీద భారత్ విజయం సాధించింది. దీంతో మూడు ట్వంటీ20 మ్యాచులో సిరీస్ లో భారత్ 1-0తో ముందంజలో ఉంది. ఆదివారం జరిగిన మ్యాచులో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 17.5 ఓవర్లలో ఐది వికెట్లు కోల్పోయి 110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కృనాల్ పాండ్యా 9 బంతుల్లో 21 పరుగులు, దినేష్ కార్తిక్ 34 బంతుల్లో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 

వెస్టిండీస్ పై జరిగిన ట్వంటీ20 మ్యాచులో భారత్ 83 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. మనీష్ పాండే 19 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికి భారత్ 30 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. 16 పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ కేవలం 3 పరుగులు చేసి థామస్ బౌలింగులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాహుల్ 16 పరుగులు చేసి ఔట్ కాగా, రిషబ్ పంత్ కేవలం  పరుగుకే పెవిలియన్ చేరుకున్నాడు. రెండు వికెట్లు కూడా బ్రేత్ వైట్ తీశాడు.

వెస్టిండీస్ తన ముందు ఉంచిన 110 పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో భారత్ 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. థామస్ వేసిన బంతి బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతిలో పడింది. తొలుత అంపైర్ నాటౌట్ గా ఇచ్చాడు. అయితే, రివ్యూలో రోహిత్ శర్మ అవుటైనట్లుగా తేలింది.

టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ చివరలో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ కాస్తా దూకుడుగా ఆడి స్కోరును పెంచారు. తొలి ట్వంటీ20 మ్యాచులో భారత్ పై జరిగిన మ్యాచులో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు 3 వికెట్లు దక్కగా, ఉమేష్ యాదవ్, ఖలీల్ అహ్మద్, బుమ్రా, కృణాల్ పాండే తలో వికెట్ తీసుకున్నారు. 

విండీస్ 56 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. పావెల్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు. 63 పరుగుల వద్ద వెస్టిండీస్ ఏడో వికెట్ కోల్పోయింది.దూకుడుగా ఆడుతూ వచ్చిన అలెన్ ఎట్టకేలకు అవుటయ్యాడు. దీంతో వెస్టిండీస్ 87 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. అలెన్ 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఖలీల్ కు ట్వంటీ20లో అలెన్ రూపంలో తొలి వికెట్ దక్కింది.

భారత్ వెస్టిండీస్ నాలుగో వికెట్ తీసింది. 47 పరుగుల వద్ద పోలార్డ్ ను కృణాల్ పాండ్యా ఔట్ చేశాడు. 49 పరుగుల వద్ద వెస్టిండీస్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రేవో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు.

భారత్ పై జరుగుతున్న తొలి ట్వంటీ20 మ్యాచులో వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రామ్ దిన్ 2 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. వెస్టిండీస్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హోప్ 14 పరుగులు చేిస రన్నవుట్ కాగా,  హెట్ మేయిర్ 10 పరుగులు చేసి బుమ్రా బౌలింగులో అవుటయ్యాడు.

తొలి ట్వంటీ 20 మ్యాచులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్ గెలిచి ఊపు మీదున్న ఇండియా టీ20 సిరీస్ ను కూడా గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.కోల్ కతా ఈడెన్ గార్జెన్ లో జరిగిన ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ కాకుండా రోహిత్ శర్మ ఇండియాకు నాయకత్వం వహించాడు. భారత్  తరఫున కృణాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్ అంతర్జాతీ పొట్టి క్రికెట్ లో ఆరంగేట్రం చేశారు. 

టీ20 స్టార్ ఆటగాళ్లు డారెన్ బ్రేవో, కీరోన్ పోలార్డ్, అండ్రై రసెల్ వెస్టిండీస్ జట్టులోకి వచ్చారు. వెస్టిండీస్ జట్టుకు బ్రాత్ వైట్ నాయకత్వం వహించాడు..

Follow Us:
Download App:
  • android
  • ios