Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ కప్ 2019.. కామెంటేటర్ గా గంగూలీ

ప్రపంచకప్ ప్రారంభం కావడానికి మరెంతో దూరం లేదు. కాగా.. ఈ వరల్డ్ కప్ కి భారత్ తరపున ముగ్గురు కామెంటేటర్లను నియమించారు. వీరిలో హర్షా భోగ్లే, సంజయ్‌ మంజ్రేకర్‌, సౌరవ్‌ గంగూలీలకు చోటు దక్కంది. 

Sourav Ganguly among 3 Indian commentators for Cricket World Cup 2019
Author
Hyderabad, First Published May 17, 2019, 12:03 PM IST

ప్రపంచకప్ ప్రారంభం కావడానికి మరెంతో దూరం లేదు. కాగా.. ఈ వరల్డ్ కప్ కి భారత్ తరపున ముగ్గురు కామెంటేటర్లను నియమించారు. వీరిలో హర్షా భోగ్లే, సంజయ్‌ మంజ్రేకర్‌, సౌరవ్‌ గంగూలీలకు చోటు దక్కంది. ఈ మెగా ఈవెంట్‌కు మొత్తం 24 మందితో కూడిన కామెంటరీ బృందాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) గురువారం ప్రకటించింది.

వీరిలో ఇంగ్లాండ్ నుంచి నలుగురు, భారత్, న్యూజిలాండ్ ల నుంచి ముగ్గురు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ తరపున ఇద్దరు,బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేశారు. అంతేకాకుండా మరో ముగ్గురు మహిళలు కూడా కామెంటరీ ప్యానల్ లో ఉన్నారు.

కామెంటేటర్ల పూర్తి  జాబితా..

నాసీర్‌ హుస్సేన్‌, మైకేల్‌ క్లార్క్‌, ఇయాన్‌ బిషప్‌, సౌరవ్‌ గంగూలీ, మిలేనీ జోన్స్‌, కుమార సంగక్కరా, మైకేల్‌ అథర్టన్‌, అలిసన్‌ మిచెల్‌, బ్రెండన్‌ మెకల్లమ్‌, గ్రేమ్‌ స్మిత్‌, వసీం అక్రమ్‌, షాన్‌ పొలాక్‌, మైఖేల్‌ స్లేటర్‌, మార్క్‌ నికోలస్‌, మైఖేల్‌ హోల్డింగ్‌, ఇషా గుహ, పొమ్మి ఎంబాగ్వా, సంజయ్‌ మంజ్రేకర్‌, హర్షా భోగ్లే, సిమోన్‌ డౌల్‌, ఇయాన్‌ స్మిత్‌,  రమీజ్‌ రాజా, అధర్‌ అలీ ఖాన్‌, ఇయాన్‌ వార్డ్‌

Follow Us:
Download App:
  • android
  • ios