Asianet News TeluguAsianet News Telugu

సచిన్‌కు క్రికెట్ ఓనమాలు నేర్పిన మాస్టర్ ఇకలేరు...

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ టీంఇండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్ కు క్రికెట్ ఓనమాలు నేర్పిన రమాకాంత్ అచ్రేకర్(86) ఇవాళ కన్నుమూశారు. ముంబయిలో ఆయన నివాసంలోనే కొద్దిసేపటి క్రితమే అచ్రేకర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 

sachin tendulkar childhood coach ramakant achrekar died
Author
Mumbai, First Published Jan 2, 2019, 7:42 PM IST

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ టీంఇండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్ కు క్రికెట్ ఓనమాలు నేర్పిన రమాకాంత్ అచ్రేకర్(86) ఇవాళ కన్నుమూశారు. ముంబయిలో ఆయన నివాసంలోనే కొద్దిసేపటి క్రితమే అచ్రేకర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 

సచిన్ కు మాత్రమే కాదు అచ్రేకర్ వద్ద క్రికెట్ మెలకువలు నేర్చుకున్న మరికొంత మంది కూడా భారత్ జట్టులో స్థానం సంపాందించారు. వినెద్ కాంబ్లీ, బల్వీందర్ సింగ్, ప్రవీణ్ ఆమ్రేలు కూడా అచ్రేకర్ శిష్యులే. ఇలా చాలామంది క్రికెటర్లను తీర్చిదిద్దిన ఆయన సచిన్ గురువుగా మాత్రం గుర్తింపు పొందారు. 

క్రికెట్ కు ఆయన అందించిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు(2010), ద్రోణాచార్య అవార్డు(1990)తో సత్కరించింది. అంతేకాకుండా ముంబయిలోని జింఖాన శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా అచ్రేకర్ కు "లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు" అవార్డుతో సత్కరించారు. 

అచ్రేకర్ మృతి పట్ల బిసిసిఐ సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత అచ్రేకర్ మృతికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్న బిసిసిఐ పేర్కొంది. ఆయన తన శిష్యులను గొప్ప క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే కాదు...గొప్ప మానవతావాదులుగా తయారు చేశారని ప్రశంసించింది. భారత క్రికెట్ కు ఆయన చేసిన సేవలు క్రీడాలోకం మరిచిపోదని బిసిసిఐ ప్రకటించింది.  


 


 

Follow Us:
Download App:
  • android
  • ios