Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ రికార్డుకు కేవలం 11పరుగుల దూరంలో రోహిత్...

భారత్-వెస్టిండిస్‌ల మద్య మంగళవారం లక్నోలో రెండో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా టీఇండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలుగొట్టే అవకాశం కనిపిస్తోంది. కోహ్లీ టీ20 లో సాధించిన అరుదైన రికార్డు రోహిత్ కేవలం 11 పరుగుల దూరంలో నిలిచాడు. అయితే టీ20 సీరిస్ నుండి కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్ లో అతడి రికార్డు ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో రెండో టీ20పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

Rohit Sharma set to overtake Virat Kohli in Twenty20 runs
Author
Lucknow, First Published Nov 6, 2018, 5:50 PM IST

భారత్-వెస్టిండిస్‌ల మద్య మంగళవారం లక్నోలో రెండో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా టీఇండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలుగొట్టే అవకాశం కనిపిస్తోంది. కోహ్లీ టీ20 లో సాధించిన అరుదైన రికార్డు రోహిత్ కేవలం 11 పరుగుల దూరంలో నిలిచాడు. అయితే టీ20 సీరిస్ నుండి కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్ లో అతడి రికార్డు ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో రెండో టీ20పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

అంతర‍్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా ప్రస్తుత రికార్డు విరాట్ కోహ్లీ పేరిట వుంది. కోహ్లీ ఇప్పటివరకు ఆడిన అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 2,102 పరుగులు సాధించాడు. అతడి తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ 2,092 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

అయితే వీరిద్దరి మధ్య పరగుల అంతరం కేవలం 11 పరుగులు మాత్రమే. దీంతో ఇవాళ లక్నోలో జరగనున్న రెండో టీ20లో రోహిత్ ఈ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఇలా ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా మారే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్ భారత అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. 

ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన అంతర్జాతీయ క్రికెటర్ల జాబితాలో న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత షోయబ్ మాలిక్(2,171), మెక్‌కల్లమ్ (2,140) పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత నాలుగో స్ధానంలో కోహ్లీ, ఐదో స్ధానంలో రోహిత్ కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్ తర్వాత ఈ స్థానాలు తారుమారు అవుతాయేమో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios