Asianet News TeluguAsianet News Telugu

చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు

మిథాలీ రాజ్ ఎవరితో కలిసి ఉండేది కాదని, ఎప్పుడూ తప్పించుకొని తిరిగేదని రమేష్ పొవార్ చెప్పినట్లు సమాచారం.  ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆమెను తప్పించడానికి ఆమెపై విరోధంతో కాదని, కేవలం ఆమె స్ట్రైక్ రేట్‌ని చూసి తప్పించామని పొవార్ చెప్పినట్లు బిసిసిఐ అధికారి ఒకరు చెప్పారు.

Ramesh Powar blames Mithali Raj
Author
Mumbai, First Published Nov 29, 2018, 8:06 AM IST

న్యూఢిల్లీ: ట్వంటీ20 మహిళా ప్రపంచ కప్ సెమీ ఫైనల్ తుది జట్టులోకి మిథాలీ రాజ్ ను తప్పించడంపై జట్టు కోచ్ రమేష్ పొవార్ వివరణ ఇచ్చారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వివాదంపై కోచ్ రమేశ్ పవార్ బీసీసీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. 

థాలీ ఎప్పుడు తప్పించుకొని తిరిగేదని చెప్పటినట్టు రమేష్ పొవార్ బిసిసిఐ అధికారులతో చెప్పినట్లు సమాచారం. మిథాలీతో వృత్తిపరంగా తనకు సరైన సాన్నిహిత్యం లేకపోవడానికి కారణం ఆమె ప్రవర్తనే అని ఆయన నిందించినట్లు తెలుస్తోంది.

మిథాలీ రాజ్ ఎవరితో కలిసి ఉండేది కాదని, ఎప్పుడూ తప్పించుకొని తిరిగేదని రమేష్ పొవార్ చెప్పినట్లు సమాచారం.  ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆమెను తప్పించడానికి ఆమెపై విరోధంతో కాదని, కేవలం ఆమె స్ట్రైక్ రేట్‌ని చూసి తప్పించామని పొవార్ చెప్పినట్లు బిసిసిఐ అధికారి ఒకరు చెప్పారు.

తనపై ఎవరో ఒత్తిడి తేవడం వల్లే మిథాలీని జట్టు నుంచి తప్పించారనే మాటలో నిజం లేదని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆమె చెత్త స్ట్రైక్ రేట్ కారణంగానే ఆమెను జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని రమేష్ పొవార్ అన్నారు.

కచ్చితంగా విజయం సాధించే జట్టునే బరిలోకి దింపాలని అనుకున్నామని, అంతేగానీ ఆమెపై ఎటువంటి విరోధం లేదని రమేష్ పొవార్ బిసిసిఐకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమెను జట్టు నుంచి తప్పించడంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదని, ఆమె స్ట్రైక్‌రేట్ కారణంగానే జట్టు నుంచి తప్పించాం కానీ ఎవరో అధికారి ఒత్తిడి చేస్తే తప్పించలేదని ఆయన చెప్పారు.

మహిళా టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తప్పించడంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్‌పై విమర్శలు ఇంకా ఆగలేదు. కీలకమైన మ్యాచ్‌లో మిథాలీని జట్టులోకి తీసుకోకపోవడంపై టీం యాజమన్యంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో జట్టు కోచ్ రమేశ్ పొవార్ తనను అవమానించారని ఆరోపిస్తూ మిథాలీ బిసిసిఐకి ఓ లేఖ రాశారు. తనను జట్టు నుంచి తప్పించారని తెలిసి ఎంతో బాధపడ్డానని లేఖలో చెప్పారు. 
 
సీఓఏ సభ్యురాలు డయానా ఎడ్లుజీ స్వార్థంతో తనను జట్టు నుంచి తప్పించడాన్ని సమర్థించారని, ఆమెను తాను ఎంతో నమ్మితే ఆమె తనపట్ల ఇలా కఠినంగా వ్యవహరించారని మిథాలీ తను బీసీసీఐకి రాసిన లేఖలో అన్నారు.

సంబంధిత వార్తలు

మిథాలీ పై వేటు.. స్పందించిన ఫరూఖ్ ఇంజినీర్

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్‌పై బీసీసీఐ ఆగ్రహం

హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్‌పై అభిమానుల ఫైర్

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

క్రికెట్‌లో సంచలనం..ఇండియాలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సనత్ జయసూర్య..?

బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోని షమి.. చెప్పిందేంటి..? చేసిందేంటీ..?

గ్రౌండ్‌లోనే కాదు... కోర్టులోనూ పాక్‌పై మనదే గెలుపు

రోహిత్‌,కోహ్లీలను వెనక్కినెట్టిన మిథాలీ...ఇప్పుడు గప్టిల్ ను కూడా...

 

Follow Us:
Download App:
  • android
  • ios