Asianet News TeluguAsianet News Telugu

రాజ్ కోట్ టెస్ట్‌లో చేతులెత్తేసిని విండీస్: భారత్ ఘనవిజయం

రాజ్ కోట్ టెస్టులో విండీస్ పై భారతజట్టు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ లో 649 పరుగులు వద్ద డిక్లేర్ చేసిన టీంఇండియా ఆ తర్వాత బౌలింగ్ లోనూ రెచ్చిపోతోంది.

rajkot test updates
Author
Rajkot, First Published Oct 5, 2018, 10:27 AM IST

రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. భారత జట్టు జోరును తట్టుకోలేక విండీస్ బౌలర్లే కాదు బ్యాట్ మెన్స్ కూడా చేతులెత్తేశారు.. దీంతో టీంఇండియా ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. ముగ్గురు బ్యాట్ మెన్స్ సెంచరీలు సాధించడంతో 649 పరుగుల వద్ద బ్యాటింగ్ ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన విండీస్ ఏ దశలోనే టీంఇండియా ఫోటీ ఇవ్వలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 181 పరుగులే సాధించింది. దీంతో పాలోఆన్లో భాగంగా మళ్లీ బ్యాటింగ్ చేసి 196 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.  

రాజ్ కోట్ టెస్టులో భారత జట్టు విజయం దాదాపు ఖాయమైంది. మొదటి ఇన్నింగ్స్ కేవలం 181 పరుగుల వద్ద  ఆలౌటైన విండీస్  భారత్ కంటే 468 పరుగులు వెనకబడింది. దీంతో ఆ జట్టు ఫాలో ఆన్ ఆడింది. అయితే రెండో ఇన్నింగ్స్ లోను విండీస్ అదే చెత్త ఆటతీరును కనబర్చింది. దీంతో భారత బౌలర్లు 185 పరుగులకే 8 వికెట్లు తీశారు. దీంతో టీంఇండియా విజయానికి మరో రెండు వికెట్లు దూరంలో సిలిచింది.   

రాజ్ కోట్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాట్ మెన్స్ వైఫల్యం కారణంగా విండీస్ ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లోనూ విండీస్ అదే ఆటతీరును కొనసాగిస్తోంది. విండీస్ కెప్టెన్ బ్రాత్ వెట్  ఓపెనర్ గా బరిలోకి దిగి కేవలం 10 పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో విండిస్ 32 పరుగుల వద్దే మొదటి వికెట్ చేజార్చుకుంది.

ఆ తర్వాత కాస్త నిలకడగా ఆడుతున్న విండిస్ కు కుల్దీప్ దెబ్బతీశాడు. హోప్ ను పెవిలియన్ కు పంపించడంతో  79 పరుగుల వద్దే రెండో వికెట్ పడింది. ప్రస్తుతం విండీస్ 20 ఓవర్లలో 92 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది.పోవేల్ కాస్త దూకుడుగా ఆడుతూ అర్థశతకం సాధించి క్రీజులో వున్నాడు. అతడికి తోడుగా హెట్మేర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 

రాజ్ కోట్ టెస్టులో విండీస్ పై భారతజట్టు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ లో 649 పరుగులు వద్ద డిక్లేర్ చేసిన టీంఇండియా ఆ తర్వాత బౌలింగ్ లోనూ రెచ్చిపోయింది. శుక్రవారమే 6 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు మరో నాలుగు వికెట్లను ఇవాళ తొందరగానే పడగొట్టారు. దీంతో కేవలం 181 పరుగులకే విండీస్ ఆలౌటయ్యంది.. దీంతో 468 పరుగులు వెనకబడ్డ విండీస్ ఫాలో ఆన్ ఆడనుంది. 

తొలి టెస్టు మ్యాచులో భారత్ వెస్టిండీస్ పై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. రెండో రోజు శుక్రవారం భారత్ 9 వికెట్ల నష్టానికి 649 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్సులో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఆట ముగిసే సమయానికి విండీస్ 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు ఇంకా చేతిలో ఉన్నాయి. అయితే, 555 పరుగులు వెనకబడి పోయింది. 

భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. షమీ రెండు వికెట్లు తీసి ఆదిలోనే వెస్టిండీస్ వెన్ను విరిచాడు. ఆ తర్వాత అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేజాలకు తలో వికెట్ దక్కాయి. 

వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. విండీస్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.హెట్మీయర్ పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా విసిరిన బంతికి రన్నవుట్ అయ్యాడు. వెస్టిండీస్ 49 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయింది. అంబ్రీస్ రవీంద్ర జడేజా బౌలింగులో వెనుదిరిగాడు. వెస్టిండీస్ 74 పరుగుల స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. డౌరిచ్ పది పరుగులు మాత్రమే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. 

భారత్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మొహమ్మద్ షమీ రెండు వికెట్లు తీశాడు. బ్రేత్ వైట్ రెండు పరుగులకు అవుట్ కాగా, పావెల్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు.

భారత బౌలర్ల ముందు వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ నిలదొక్కుకలేకపోతున్నారు. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. హోప్ 10 పరుగులు చేసి అశ్విన్ కు దొరికాడు.

వెస్టిండీస్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సును భారత్ 9 వికెట్ల నష్టానికి 649 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి కాగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్సును డిక్లేర్ చేశారు. విరాట్ కోహ్లీ, జడేజా సెంచరీలతో చెలరేగి పోగా, రిషబ్ పంత్ 92 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో బిషూ 4 వికెట్లు తీసుకోగా, లూయిస్ రెండు వికెట్ల పడగొట్టాడు. గాబ్రియెల్, చేస్, బ్రేత్ వైట్ లకు తలా ఒక వికెట్ దక్కింది. 

వెస్టిండీస్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో శుక్రవారం విరాట్ కోహ్లీ 230 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 139 పరుగులు చేసి లూయిస్ బౌలింగ్ లో బిషూకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. భారత్ 545 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.కల్దీప్ నాయర్ ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 571 పరుగులు చేసింది.

భారత్ 626 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 24 బంతుల్లో 22 పరుగులు చేసి అతను బ్రేత్ వైట్ బౌలింగులో అవుటయ్యాడు. కాగా, రవీంద్ర జడేజా బ్యాట్ తో రాణించాడు. అతను సెంచరీ పూర్తి చేశాడు.

వెస్టిండీస్ పై జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్సులో రిషబ్ అర్థ సెంచరీ చేసి ధీటుగా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. టెస్టు మ్యాచుల్లో ఆయనకు ఇది 24వ సెంచరీ. 184 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రిషబ్ పంత్ సిక్సర్లతో మోత మోగిస్తూ సెంచరీ మిస్సయ్యాడు. 84 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 92 పరుగులు చేసి బిషూ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో భారత్ 

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువయ్యాడు. ఓవర్ నైట్ స్కోరు 364 పరుగులతో రెండోరోజు ఆట ప్రారంభించిన భారత్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రిషబ్ పంత్ ముందుండి నడిపిస్తున్నారు.

ప్రస్తుతం విరాట్ 88 పరుగులతోనూ.. పంత్ 40 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా 134, పుజారా 86, రహానే 41 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడానికి పునాది వేశారు. 

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన

నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విషా

Follow Us:
Download App:
  • android
  • ios