Asianet News TeluguAsianet News Telugu

హామిల్టన్ టీ20: పోరాడి ఓడిన భారత్, సిరీస్ న్యూజిలాండ్ వశం

మూడు టీ20లో సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 4 పరుగులతో ఓటమి పాలైంది. విజయం కోసం చివరి వరకు పోరాడినప్పటికీ విజయం న్యూజిలాండ్ వైపే నిలిచింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 2-1 తేడాతో కివీస్ వశమైంది. 

New Zealand vs India, 3rd T20, live updates
Author
Hamilton, First Published Feb 10, 2019, 12:15 PM IST

మూడు టీ20లో సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 5 పరుగులతో ఓటమి పాలైంది. విజయం కోసం చివరి వరకు పోరాడినప్పటికీ విజయం న్యూజిలాండ్ వైపే నిలిచింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 2-1 తేడాతో కివీస్ వశమైంది.

కివీస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ వెంటనే ఔటవ్వగా.. ఆతర్వాత విజయ్‌శంకర్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.

శంకర్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత అతను పెవిలియన్ చేరడంతో పంత్ సాయంతో రోహిత్ లక్ష్యం దిశగా జట్టును నడిపించాడు. ఈ క్రమంలో స్వల్ప వ్యవధిలోనే రిషభ్, రోహిత్, ధోనీ, పాండ్యా వెనుదిరగడంతో ఓటమి ఖాయమనుకున్నారు.

కానీ చివర్లో దినేశ్ కార్తీక్, కృణాల్ పాండ్యాల జోడీ విజయంపై ఆశలు కల్పించింది. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన వీరిద్దరూ చివరి వరకు పోరాడారు. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో కివీస్ బౌలర్ సౌథీ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. 

దానికి తోడు న్యూజిలాండ్ ఫీల్డర్లు పకడ్బంధీగా ఫిల్డింగ్ చేయడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. భారత ఆటగాళ్లలో విజయ్ శంకర్ 43, రోహిత్ శర్మ 38, దినేశ్ కార్తీక్ 33, రిషభ్ పంత్ 28, కృనాల్ పాండ్యా 26 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, డారెల్ మిచెల్ తలో 2 వికెట్లు తీశారు.

టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. 2 పరుగుల స్కోరు వద్ద ధోనీ.. డారెల్ మిచెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విజయానికి ఇంకా 60 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో కేవలం 26 బంతులు మాత్రమే ఉన్నాయి. 

టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న హార్డిక్ పాండ్యా 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుగ్గిల్లిజిన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి ఇంకా 31 బంతుల్లో 68 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ధోనీ, దినేశ్ కార్తీక్ ఉన్నాడు. 

భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా తన సహజశైలికి భిన్నంగా ఆడుతూ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డారెల్ మిచెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ధాటిగా బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టిక్నర్ బౌలింగ్‌లో 3వ వికెట్‌గా వెనుదిరిగాడు. విజయానికి భారత్ 46 బంతుల్లో 92 పరుగులు చేయాల్సి ఉంది. 

భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న విజయ్ శంకర్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శాంట్నార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకు ముందు రోహిత్ శర్మతో కలిసి శంకర్ 2వ వికెట్‌కు 75 పరుగులు జోడించాడు.

న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శాంట్నార్ బౌలింగ్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ ఔటయ్యాడు. 

చివరి టీ20లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు ధాటిగా ఆడి భారత్ ముందు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ షీఫెర్ట్, మన్రోలు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.  

ఈ క్రమంలో సీఫెర్ట్ ఔటైనా మన్రో జోరును కొనసాగించి 76 పరుగుల వద్ద తృుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అనంతరం చివరి వరుస బ్యాట్స్‌మెన్లు కూడా మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ 2, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్‌ను పడగొట్టారు. 

న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్రాండ్ హోమ్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మన్రో, విలియ్సన్ ఔటైన తర్వాత దూకుడుగా ఆడిన గ్రాండ్ హోమ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

స్పిన్నర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విలియమ్సన్ 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. అర్థసెంచరీతో భారత బౌలర్లను ఓ ఆటాడుకున్న ఓపెనర్ మన్రో 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మన్రో బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

న్యూజిలాండ్ ఓపెనర్ మన్రో అర్థసెంచరీ సాధించాడు. తొలి నుంచి దూకుడుగా ఆడిన మన్రో కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది అతనికి టీ20లలో 9వది. 

ప్రమాదకర ఓపెనర్ సీఫెర్ట్ ఔటయ్యాడు. 25 బంతుల్లో 43 పరుగులు చేసి ఊపుప మీదున్న అతనిని కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో ధోనీ అద్భుతమైన స్టంపింగ్‌తో బోల్తా కొట్టించాడు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ హామిల్టన్‌లో చివరి టీ20 జరగనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఇరు జట్లు తలా ఒక విజయంతో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతున్నాయి. దీంతో హామిల్టన్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది.

Follow Us:
Download App:
  • android
  • ios