Asianet News TeluguAsianet News Telugu

వెల్లింగ్టన్ టీ20: చుక్కలు చూపించిన కివీస్ బౌలర్లు, భారత్ ఓటమి

న్యూజిలాండ్ పై జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. కివీస్ బౌలర్లు భారత బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. దీంతో భారత్ 80 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.

New Zealand vs India, 1st T20 live updates
Author
Wellington, First Published Feb 6, 2019, 12:26 PM IST

న్యూజిలాండ్ పై జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో భారత్ చేతులెత్తేసింది. 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. వరుసగా వికెట్లను జారవిడుచుకుంటూ ఓ స్థితిలోనూ కివీస్ బౌలర్లను భారత బ్యాట్స్ మెన్ ఎదుర్కోలేకపోయారు. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా, భారత్ 139 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ట్వంటీ20 సిరీస్ లో కివీస్ 1-0 స్కోరుతో ముందంజలో ఉంది.

కివీస్ విజయంలో టిమ్ స్టీఫెర్ట్ కీలక పాత్ర పోషించాడు. అతను భారత బౌలర్లను ఉతికి ఆరేస్తూ 43 బంతుల్లో 6 సిక్సులు, 7 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. దానికి తోడు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ ను కివీస్ సునాయసంగా ఓడించగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 3 వికెట్లు పడగొట్టగా, ఫెర్గూసన్, సాంత్నార్, సౌథీలకు రెండేసి వికెట్లు దక్కాయి. మిచెల్ కు ఒక్క వికెట్ లభించింది.

న్యూజిలాండ్ పై జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడి ఓటమి పాలైంది. 136 పరుగుల స్కోరు వద్ద మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో వికెట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. ధోనీ 31 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఓటమి లాంఛనంగానే మారింది.

129 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోవడంతో ఓటమి ఖాయమైంది. కృణాల్ పాండ్యా సౌథీ బౌలింగులో 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. 132 పరుగుల వద్ద భారత్ 8వ వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఫెర్గూసన్ బౌలింగులో అవుటయ్యాడు. 72 పరుగుల స్కోరు వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఐదు పరుగులు మాత్రమే చేసి దినేష్ కార్తిక్ పెవిలియన్ బాట పట్టాడు. భారత్ 77 పరుగుల స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా 4 పరుగులు మాత్రమే చేసి సోథీ బౌలింగులో అవుటయ్యాడు.

భారత్ 64 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ కేవలం 4 పరుగులు చేసి సాంత్నార్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే  విజయ్ శంకర్ 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో 65 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి ఆదిలోనే ఓపెనర్లిద్దరిని కోల్పోయింది. రోహిత్ శర్మ రెండో ఓవర్లోనే సౌథీ బౌలింగ్ లో ఔటవగా... పెర్గ్‌సన్ వేసిన ఐదో ఓవర్లో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఔటయ్యాడు. దీంతో 6.2 ఓవర్లకే టీంఇండియా కేవలం 59 పరుగులు చేసి కీలకమైన ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 1 పరుగు  మాత్రమే చేసి ఔటయ్యాడు. 

వెల్లింగ్టన్‌ టీ20లో న్యూజిలాండ్ చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి, భారత్‌ ముందు 220భారీ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో హార్డిక్ పాండ్యా 2, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, కృణాల్ పాండ్యా, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

ప్రమాదకర రాస్‌టేలర్‌ను భువనేశ్వర్ ఔట్ చేయడంతో కివీస్ 6వ వికెట్ కోల్పోయింది. 14 బంతుల్లో 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన టేలర్ దూకుడుగా ఆడాడు. హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ గ్రాండ్‌హోమ్మీ ఔటవ్వడంతో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది.34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ విలియమ్సన్‌ను హార్డిక్ పాండ్యా ఔట్ చేశాడు

న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డారెల్ మిచెల్... హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 84 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. క్రీజులో ఉన్నంత సేపు వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ దాటించిన సీఫెర్ట్ 30 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరి దిశగా వెళుతుండగా ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 

ఓపెనర్ సీఫెర్ట్ కేవలం 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది అతనికి టీ20లలో తొలి అర్థసెంచరీ. 34 పరుగులతో ఊపు మీదున్న ఓపెనర్ మున్రో ఔటయ్యాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో అతను విధ్వంసం సృష్టించాడు

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 బుధవారం వెల్లింగ్టన్‌లో జరిగింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios