Asianet News TeluguAsianet News Telugu

మిథాలీ తొలగింపు వివాదం: హార్మన్‌ను వివరణ కోరనున్న బీసీసీఐ

మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మిథాలీ రాజ్‌ను ఆడించకుండా రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేసిన వ్యవహారం పెను వివాదంగా మారుతోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ నిర్ణయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. దీనిపై బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. 

murder in yellareddyguda
Author
Mumbai, First Published Nov 26, 2018, 9:24 AM IST

మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మిథాలీ రాజ్‌ను ఆడించకుండా రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేసిన వ్యవహారం పెను వివాదంగా మారుతోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ నిర్ణయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

దీనిపై బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మిథాలీ వ్యవహారంపై హార్మన్‌ను కమిటీ వివరణ కోరాలని నిర్ణయించింది. టీమిండియా స్వేదశం తిరిగొచ్చిన తర్వాత దీనికి సంబంధించి మిథాలీ రాజ్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పవార్, మేనేజర్ తృప్తి, సెలక్టర్ సుధా షాలతో సీఓఏ బృందం విడి విడిగా మాట్లాడనుంది.

మరోవైపు మిథాలీ రాజ్‌ను తప్పించే క్రమంలో మ్యాచ్‌కు ముందు రోజు జరిగిన సమావేశం గురించి మీడియాలో వార్తలు రావడంపైనా సీఓఏ అసహనం వ్యక్తం చేసింది. అంటిగ్వాలో ఇంగ్లాండ్‌తో జరిగిన అత్యంత కీలకమైన సెమీఫైనల్లో భారత్ ఓడిపోయింది.

ఈ టోర్నీలో రెండు అర్థసెంచరీలు చేసి భీకర ఫాంలో ఉన్న మిథాలీని సెమీఫైనల్‌లో పక్కనబెట్టడం వల్లే భారత్ ఓడిపోయిందని అభిమానులు కెప్టెన్ హార్మన్ ప్రీత్‌పై మండిపడ్డారు. మ్యాచ్ అనంతరం దీనిపై స్పందించిన హర్మన్...మేం రచించే వ్యూహాలు కొన్ని సార్లు ఫెయిల్ అవుతాయి.. మరికొన్నిసార్లు సక్సెస్ అవుతాయని చెప్పారు. 

మహిళల టీ20 ప్రపంచకప్.. నాలుగోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా

మహిళల టీ20 ప్రపంచకప్: ఇండియాను కట్టికరిపించి... ఫైనల్లో ఇంగ్లాండ్

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్‌పై అభిమానుల ఫైర్

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

రోహిత్‌,కోహ్లీలను వెనక్కినెట్టిన మిథాలీ...ఇప్పుడు గప్టిల్ ను కూడా...

టీ20లలో మిథాలీ రాజ్ సంచలనం.. రోహిత్ రికార్డు బద్ధలు

Follow Us:
Download App:
  • android
  • ios