Asianet News TeluguAsianet News Telugu

హార్దిక్ పాండ్యా... టీంఇండియాకి ప్లస్ : కపిల్ దేవ్

వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా... టీం ఇండియాకి కచ్చితంగా ప్లస్ అవుతాడని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీని తర్వాత వెంటనే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 

MS Dhoni, Virat Kohli "Unmatchable", India Favourites To Win World Cup, Says Kapil Dev
Author
Hyderabad, First Published May 9, 2019, 12:47 PM IST


వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా... టీం ఇండియాకి కచ్చితంగా ప్లస్ అవుతాడని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీని తర్వాత వెంటనే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో... వరల్డ్ కప్ గురించి కపిల్ దేవ్ స్పందించారు.

అనుభవజ్ఞులు, యువకులతో సమతూకంగా ఉండడమే టీమిండియా బలమని భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నాడు. కచ్చితంగా టీం ఇండియా వరల్డ్ కప్ లో టాప్ 4లో ఉంటుందని చెప్పారు. ధోని, కోహ్లి జట్టులో ఉండటం మరింత కలిసొచ్చే అంశమని చెప్పారు. అయితే.. ఎవరు గెలుస్తారు అనే విషయం మాత్రం కచ్చితంగా చెప్పలేమని  చెప్పారు.

భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కచ్చితంగా సెమీస్‌ చేరే అవకాశముందని, నాలుగో బెర్త్‌ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా పోటీ పడే చాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డారు.వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్, వెస్టిండీస్‌ జట్లు ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తాయని కపిల్‌ చెప్పాడు. 

టీమిండియాకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కచ్చితంగా ప్లస్‌ అవుతాడని, అతడిని అధిక ఒత్తిడికి గురిచేయకుండా సహజంగా ఆడనివ్వాలని సూచించాడు. బుమ్రా, షమీ చక్కగా బౌలింగ్‌ చేస్తున్నారని టీమ్‌లో వీరిద్దరూ కీలకమని కపిల్‌దేవ్‌ తెలిపారు

Follow Us:
Download App:
  • android
  • ios