Asianet News TeluguAsianet News Telugu

ఊడిన పంత్ షూ లేస్... రైనా చేసిన పనికి నెటిజన్లు ఫిదా

ప్రత్యర్థి ఆటగాడిని ఓడించేందుకు ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని అందరూ చూస్తుంటారు. కానీ... ప్రత్యర్థి జట్టు సభ్యుడికి ఆటలో ఏదైనా ఆటంకం ఎదురైతే... ఎదురెళ్లి ఎవరైనా సహాయం చేస్తారా..? చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రైనా చేశాడు. 

IPL 2019: Suresh Raina Ties Shoe Laces Of Rishabh Pant During CSK VS DC Qualifier 2 Match
Author
Hyderabad, First Published May 11, 2019, 12:26 PM IST

ప్రత్యర్థి ఆటగాడిని ఓడించేందుకు ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని అందరూ చూస్తుంటారు. కానీ... ప్రత్యర్థి జట్టు సభ్యుడికి ఆటలో ఏదైనా ఆటంకం ఎదురైతే... ఎదురెళ్లి ఎవరైనా సహాయం చేస్తారా..? చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రైనా చేశాడు. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రైనా చూసిన పనికి ఇప్పుడు నెటిజన్లు అంతా ఫిదా అయ్యారు.

ఆడుతున్నది కీలకమైన క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ అయినా.. అదేమీ పట్టించుకోకుండా రిషభ్‌ పంత్‌ షూస్‌ లేస్‌ ఉడిపోగానే.. వెంటనే సురేశ్‌ రైనా పరిగెత్తుకెళ్లి లేస్‌ కట్టాడు. వైజాగ్‌లో శుక్రవారం జరిగిన ఐపీఎల్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ ఈ అరుదైన క్రీడాస్ఫూర్తికి వేదికగా నిలిచింది. 

ఐపీఎల్ సీజన్ లో యువ క్రికెటర్ రిషబ్ పంత్... తన బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో కూడా చెన్నైని ఎదుర్కునేందుకు పంత్ ఒంటరి పోరాటం చేశాడు. బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో సడెన్ గా పంత్ షూ లేస్ ఊడిపోయాయి. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రైనా వెంటనే గమనించి.. పంత్ షూ లేస్ కట్టేశాడు.

ఫోటో గ్రాఫర్లు.. కెమేరా మెన్లు... వెంటనే ఆ ఘటనను తమ కెమేరాల్లో బంధించేశారు. ఇంకేముంది ఈ వీడియో వైరల్ అయిపోయింది. రైనా- పంత్ ల స్నేహ బంధాన్ని.. రైనా తీరును నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios