Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి మరెంతో దూరంలో లేదు. ఐపీఎల్-2019 సీజన్ కి సంబంధించి తొలి రెండు వారాల షెడ్యూల్ ని ప్రకటించారు.

IPL 2019 Schedule For First Two Weeks Announced, CSK To Play RCB In Opener On March 23
Author
Hyderabad, First Published Feb 19, 2019, 4:00 PM IST

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి మరెంతో దూరంలో లేదు. ఐపీఎల్-2019 సీజన్ కి సంబంధించి తొలి రెండు వారాల షెడ్యూల్ ని ప్రకటించారు. ఈ మేరకు 17 మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా ప్రకటించారు. మార్చి 23వ తేదీ నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా జరిగనున్న తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

త్వరలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు వారాలకు సంబంధించిన షెడ్యూల్ ని మాత్రమే విడుదల చేశారు. పోలింగ్ తేదీల వివరాలు ప్రకటించిన తర్వాత దానిని బట్టి మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్స్ ని విడుదల చేయనున్నారు. 

ఐపీఎల్ -2019 షెడ్యూల్..
1. మార్చి 23- చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(చెన్నై)

2. మార్చి 24- కోల్‌కతా నైట్‌రైడర్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(కోల్‌కతా)

3. మార్చి 24-ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ కేపిటల్స్‌(ముంబై)

4. మార్చి 25- రాజస్తాన్‌ రాయల్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(జైపూర్‌)

5. మార్చి 26- ఢిల్లీ కేపిటల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌(ఢిల్లీ)

6. మార్చి 27-కోల్‌కతా నైట్‌రైడర్స్‌- కింగ్స్‌ పంజాబ్‌(కోల్‌కతా)

7. మార్చి 28-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-ముంబై ఇండియన్స్‌(బెంగళూరు)

8. మార్చి 29-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(హైదరాబాద్‌)

9. మార్చి 30- కింగ్స్‌ పంజాబ్‌-ముంబై ఇండియన్స్‌(మొహాలీ)

10. మార్చి 30- ఢిల్లీ కేపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(ఢిల్లీ)

11. మార్చి 31- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(హైదరాబాద్‌)

12. మార్చి 31-చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(చెన్నై)

13. ఏప్రిల్‌ 1- కింగ్స్‌ పంజాబ్‌-ఢిల్లీ కేపిటల్స్‌(మొహాలీ)

14. ఏప్రిల్‌ 2- రాజస్తాన్‌ రాయల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(జైపూర్‌)

15. ఏప్రిల్‌ 3-ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌(ముంబై)

16. ఏప్రిల్‌ 4- ఢిల్లీ కేపిటల్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఢిల్లీ)

17. ఏప్రిల్‌ 5- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(బెంగళూరు)

Follow Us:
Download App:
  • android
  • ios