Asianet News TeluguAsianet News Telugu

భారీ ధర పలికిన ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 క్రికెటర్ల వేలం ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ వేలంలో ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారికి తొలి రౌండ్ లోనే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

IPL 2019: hanuma vihari to delhi capitals
Author
Hyderabad, First Published Dec 18, 2018, 4:24 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 క్రికెటర్ల వేలం ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ వేలంలో ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారికి తొలి రౌండ్ లోనే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్లకు హనుమ విహారిని దక్కించుకుంది. 

కొద్దిరోజులుగా నిలకడగా రాణిస్తున్న హనుమ విహారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. కనీస ధర రూ.50లక్షలతో వేలంలో పాల్గొన్న ఆల్‌రౌండర్ కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా ఆఖరికి రూ.2కోట్లకు విహారిని ఢిల్లీ దక్కించుకుంది.

షిమ్రాన్ హెట్మెయర్ ను రూ.4.20కోట్లకు బెంగళూరు దక్కించుకుంది. వైట్ ను రూ.5కోట్లకు కోల్ కత్తా నైట్ రైటర్స్ దక్కించుకున్నారు. 3దేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొంటున్నారు. ఈసారి వేలం ప్రక్రియను జైపూర్ లో  హ్యూస్ ఎడ్ మెయిడాస్ నిర్వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios