Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్ భారత్ దే: మూడోసారీ బంగ్లాదేశ్ కు నిరాశే

భారత్, బంగ్లాదేశ్ ల మద్య జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. మొదట బంగ్లా బ్యాట్ మెన్స్ ఆధిపత్యం చెలాయించినా పుంజుకున్న భారత బౌలర్లు టపటపా వికెట్లు పడగొడుతున్నారు. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. 
 

india vs bangladesh asia cup final match updates
Author
Abu Dhabi - United Arab Emirates, First Published Sep 28, 2018, 4:44 PM IST

భారత్ ఆసియా కప్ ను గెలుచుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ ను 3 వికెట్ల తేడాతో ఓడించి కప్ ను దక్కించుకుంది. చివరి బంతికి గానీ విజయం భారత్ వశం కాలేదు. నిర్ణీత 50 ఓవర్లలో 223 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ నిజానికి గెలిచినంత పని చేసింది. ఆసియా కప్ ను గెలుచుకోవాలనే బంగ్లాదేశ్ లక్ష్యం మూడో సారి కూడా విఫలమైంది. గతంలో ఓసారి పాకిస్తాన్ పై, రెండో సారి భారత్ పై ఫైనల్లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచులోనూ బంగ్లాదేశ్ చివరి వరకు వీరోచితంగా పోరాడి ఓడిపోయింది. 

విజయాన్ని అందుకోవడానికి భారత్ చెమటోడ్చాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ బౌలింగు ముందు భారత బ్యాట్స్ మెన్ ఎవరూ నిలకడగా ఆడలేకపోయారు. నిజానికి, ధోనీ అవుటైన తర్వాత భారత అభిమానులు విజయంపై ఆశ వదులుకున్నారు. కానీ, జడేజా, భువనేశ్వర్, చివరలో కేదార్ జాదవ్ విజయానికి బాటలు వేశారు. 

బంగ్లాదేశ్ పై విజయానికి 17 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన స్థితిలో రవీంద్ర జడేజా అవుటయ్యాడు. భారత్ దాంతో 212 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దాంతో 16 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. 214 పరుగుల భారత్ స్కోరు వద్ద భూవీ ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. అప్పటికి భారత్ 11 బంతుల్లో 9 పరుగులు చేాయాల్సిన స్థితిలో పడింది.

బంగ్లాదేశ్ పై జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో భారత్ కష్టాల్లో పడింది. 160 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మహేంద్ర సింగ్ ధోనీ 67 బంతుల్లో 36 పరుగులు చేసి రెహ్మాన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

బంగ్లాదేశ్ పై  ఆసియా కప్ ఫైనల్లో భారత్ 30.4 ఓవర్ల వద్ద 137 పరుగులు చేసి నాలుగో వికెట్ కోల్పోయింది. దినేష్ కార్తిక్ 61 బంతుల్లో 37 పరుగులు చేసి మహ్మదుల్లా బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు.భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీ మిస్సయ్యాడు. 48 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద రుబెల్ బౌలింగులో వెనుదిరిగాడు. అప్పటికి భారత్ బంగ్లాదేశ్ పై 16.4 ఓవర్లలో 83 పరుగులు చేసింది.

ఆసియా కప్ ఫైనల్లో భారత్ 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ 14 బంతుల్లో 15 పరుగులు చేసి నజ్ముల్ ఇస్లామ్ బౌలింగులో సౌమ్య సర్కార్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. 7.3 ఓవర్ల వద్ద 46 పరుగులు చేసి భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు కేవలం రెండు పరుగులు చేసి మొర్తాజా బౌలింగులో వికెట్ కీపర్ రహీంకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆసియా కప్ ఫైనల్ మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ 222 పరుగులకే కుప్పకూలింది. ఆట ప్రారంభంలో ఓపెనర్లు దాటిగా ఆడటంతో బంగ్లా భారీ స్కోరు చేసేలా కనిపించింది. 120 పరుగుల వరకు బంగ్లా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడింది. అయితే అక్కడి నుండి భారత బౌలర్ల జోరు కొనసాగింది. బ్యాట్ మెన్స్  వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టడంతో 222 పరుగులకే బంగ్లా చాప చుట్టేసింది. 

బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్ సెంచరీతో చెలరేగాడు. ఇతడు 117 బంతులాడి 121 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడి తర్వాత సౌమ్య సర్కార్ 33 పరుగులు, మెహిది హసన్ 32 పరుగులు సాధించారు. మిగతావారెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. 

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, జాదవ్ 2, బుమ్రా1, చాహల్ 1 వికెట్ తీసుకున్నారు. జడేజా, భువనేశ్వర్లకు వికెట్లేవీ దక్కలేవు. బంగ్లా మరో తొమ్మిది బంతులు మిగిలుండగానే ఆలౌటయ్యింది. 

కాస్త ఆలస్యమైనా భారత బౌలర్ల విజృంభన మొదలైంది. ఓ దశలో 120 పరుగుల వద్ద వికెట్ నష్టపోకుండా వున్న బంగ్లా  199 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన లిటన్ దాస్ కూడా పెవిలియన్ కు చేరాడు. కుల్దీప్ బౌలింగ్ లో ధోని అద్బుతమైన స్టంప్ చేసి లిటన్ ను ఔట్ చేశాడు. దీంతో 121 పరుగులు 117 బంతుల్లో చేసిన లిటన్ ఔటయ్యాడు. ఆ తర్వాతే మూర్తజా కూడా ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.

మ్యాచ్ ప్రారంభం నుండి భారత బౌలర్లను చితక్కొడుతూ వచ్చిన ఈ బంగ్లా ఓపెనర్  వికెట్లు టప టపా పడుతున్న సమయంలో కూడా సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించాడు. ఓ దశలో 120 పరుగులకు వికెట్ నష్టపోకుండా వున్న బంగ్లా ఇప్పుడు 151 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ టోర్నీ మొత్తంలో అదరగొట్టిన మష్పికర్ రహీమ్, మిథున్ లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 

ఒపెనింగ్ బాగస్వామ్యాన్ని విడదీయడానికి భారత బౌలర్లు చాలా కష్టపడ్డారు.అయితే స్పిన్నర్ జాదవ్ బౌలింగ్ మెహదీ హసన్  ఔటవడంతో బంగ్లా మొదటి వికెట్ కోల్పోయింది.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అతడు చాహల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇలా భారత స్పిన్నర్లు మెల్లగా మ్యాచ్ ను తిప్పేస్తున్నారు. బంగ్లా 25 ఓవర్లలో 135 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. 

ఎట్టకేలకు బంగ్లా ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. భారత బౌలర్ల కు కాస్త ఊరట లభించింది. 120 పరుగుల వద్ద కేదార్ జాదవ్ బౌలింగ్ లో బంగ్లా ఓపెనర్ మెహదీ హసన్ (32 పరుగులు) ఔటయ్యాడు. బంగ్లాదేశ్  ఈ టోర్నీలోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదుచేసింది. ఈ ఇద్దరు కలిసి కేవలం 18 ఓవర్లలోనే 102 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొత్తానికి  వికెట్లేవీ నష్టపోకుండా అజేయంగా బంగ్లా టీంస్కోరును సెంచరీ మార్కు దాటింది.

ఓపెనర్ లిటన్ దాస్ తన అద్బుత బ్యాటింగ్ తో భారత బౌలర్లపై విరుచుకుపడుతూ అర్థశతకం సాధించాడు. కేవలం 32 బంతుల్లోనే అతడు 50 పరుగులను పూర్తిచేసుకున్నాడు. లిటన్ కు మెహదీ హసన్ చక్కటి సహకారం అందించాడు. బంగ్లా వికెట్ నష్టపోకుండానే 12  ఓవర్లలో 74  పరుగులు చేసింది. కేవలం ఎనిమిది ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా బంగ్లా 58 పరుగులు చేసింది.
 

 

ఆసియా కప్ సంబంధిత వార్తలు

పాక్ ను చిత్తు చేసిన బంగ్లా: ఫైనల్లో భారత్ తో పోరు

మ్యాచ్ టై: భారత్ ను వణికించిన అఫ్గానిస్తాన్

రాహుల్.. ఇదంతా నీవల్లే.. నెటిజన్ల మండిపాటు

తగ్గని వెన్నునొప్పి.. ఆసియాకప్ నుంచి వైదొలిగిన హార్డిక్ పాండ్యా

పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గాయపడ్డ హర్దిక్ పాండ్యా... స్ట్రెచర్ పై గ్రౌండ్ బయటకు తరలింపు

 

Follow Us:
Download App:
  • android
  • ios