Asianet News TeluguAsianet News Telugu

పాండ్యా భయపడుతున్నాడు.. తండ్రి హిమాన్షు

తమ కుమారుడు హార్దిక్ పాండ్యా.. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలన్నా కూడా భయపడిపోతున్నాడని అతని తండ్రి హిమాన్షు తెలిపారు. 

Hardik Pandya refusing to step out of the house, not taking calls: Father Himanshu
Author
Hyderabad, First Published Jan 16, 2019, 2:34 PM IST

తమ కుమారుడు హార్దిక్ పాండ్యా.. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలన్నా కూడా భయపడిపోతున్నాడని అతని తండ్రి హిమాన్షు తెలిపారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో అమ్మాయిల  గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. అతని కామెంట్స్ పై బీసీసీఐ కూడా సీరియస్ అయ్యింది. ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే మ్యాచ్ కి కూడా పాండ్యా ఈ కామెంట్స్ కారణంగానే దూరమయ్యాడు.

అయితే.. ఈ మ్యాచ్ కి దూరం కావడం పట్ల పాండ్యా బాగా అప్ సెట్ అయ్యాడని అతని తండ్రి హిమాన్షు తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన ‘ఇంటికి వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్లింది లేదు. కనీసం ఎవరైనా ఫోన్‌ చేసినా కూడా లిఫ్ట్‌ చేయడంలేదు. విరామం తీసుకుంటున్నాడు’ అని చెప్పారు.

సంక్రాంతి పండగ రోజు కూడా పాండ్యా ఇంట్లో డల్ గా కూర్చొని ఉన్నాడని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాండ్యాకి కైట్స్ ఎగరవేయడమంటే చాలా ఇష్టం.. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా కైట్స్ ఎగురవేయడం లేదని  చెప్పారు. టీవీ షోలో చేసిన కామెంట్స్ కి చాలా బాధపడుతున్నాడని.. ఇలాంటి తప్పు మళ్లీ చేయడని ఆయన పాండ్యా తరపున హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios