Asianet News TeluguAsianet News Telugu

రిటైర్మెంట్‌పై మరోసారి స్పందించిన ధోని...(వీడియో)

ఆస్ట్రేలియా జట్టుపై నిర్ణయాత్మక చివరి వన్డేలో మహేంద్ర సింగ్ ధోని  మ్యాచ్ విన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రౌండ్ లోంచి బయటకు వస్తూ ధోని తన రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని జట్టు కోచింగ్ సిబ్బందితో అన్న మాటలు రికార్డయి టివీలో ప్రసారమయ్యాయి. ధోని సరదాగానే అన్న ఈ మాటలు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 

dhoni retirement statements on melbourne odi
Author
Melbourne VIC, First Published Jan 19, 2019, 12:49 PM IST

ఆస్ట్రేలియా జట్టుపై చివరి నిర్నయాత్మక వన్డేలో మహేంద్ర సింగ్ ధోని  మ్యాచ్ విన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రౌండ్ లోంచి బయటకు వస్తూ ధోని తన రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని జట్టు కోచింగ్ సిబ్బందితో అన్న మాటలు రికార్డయి టివీలో ప్రసారమయ్యాయి. ధోని సరదాగానే అన్న ఈ మాటలు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 

మెల్ బోర్న్ వన్డేలో ధోని ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 114 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యువ క్రికెటర్ కేదార్ జాదవ్(57 బంతుల్లో 61 పరుగులు) తో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే మైదానంలో గెలుపు సంబరాల తర్వాత ధోని మరోసారి అఫైర్ నుండి బాల్ తీసుకున్నాడు. 

అనంతరం  ఆ బాల్ ను పట్టుకుని బయటకు వస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన చేతిలోని బంతిని కోచ్ సంజయ్ బంగర్ కు అందిస్తూ '' ఈ బంతిని మీ  దగ్గర ఉంచండి...లేకుంటే మళ్లీ తీను రిటైరైపోతున్నానని, అందుకోసమే అంపైర్ నుండి  బాల్ తీసుకున్నానని ప్రచారం జరుగుతుంది'' అని అన్నాడు.ఈ వ్యాఖ్యలు టీవిలో ప్రచారమవడంతో ధోని రిటైర్మెంట్ పై మరోసారి చర్చ జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

గతంలో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో కూడా ధోని ఇలాగే అంఫైర్ నుండి సరదాగా బంతిని తీసుకున్నాడు. దీంతో ధోని త్వరలో రిటైర్ కానున్నాడని...అందుకోసమే జ్ఞాపకంగా వుంటేందని బంతిని తీసుకున్నాడంటూ ప్రచారం జరిగింది. దీనిపై ధోని కూడా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అలాంటి ప్రచారం జరక్కుండా ధోని ముందుగానే జాగ్రత్తపడ్డారు. 

వచ్చే వరల్డ్ కప్ వరకు తన రిటైర్మెంట్ ఉండదని ధోని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్ కప్ కోసమ ఎదురుచూస్తున్నానని గతంలో ఆయన వెల్లడించారు. ఇలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చినప్పటికి అప్పుడప్పుడు ధోని రిటైర్మెంట్ పై పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

వీడియో 

సంబంధిత వార్తలు

మెల్బోర్న్ వన్డే: వివాదంగా మారిన భువీ బంతి, ఫించ్ పై ప్రతీకారం

సచిన్ ను కెలికి ధోనీని ఆకాశానికెత్తిన రవిశాస్త్రి

ఓటమికి ధోనీనే కారణం, మా తప్పిదమే..ఆసిస్ కోచ్

ఏ స్థానంలోనైనా నేను రెడీ: ధోనీ ఆత్మవిశ్వాసం

అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు

మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్

2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

Follow Us:
Download App:
  • android
  • ios