Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్ ఇయర్ రౌండప్ 2018: వివాదాలు, మెరుపులు

శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది.

cricket year roundup 2018
Author
Hyderabad, First Published Dec 31, 2018, 1:22 PM IST

* శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది.

* టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక సర్ గ్యార్‌ఫీల్డ్ సోబర్స్ అవార్డుతో పాటు బెస్ట్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నాడు. అలాగే ఐసీసీ టెస్ట్, వన్డే జట్టకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు

* అంధుల క్రికెట్ వరల్డ్‌కప్ విజేతగా భారత్ ఆవిర్భవించింది. షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌‌‌పై భారత్ విజయం సాధించింది. తద్వారా రెండో సారి ఈ ఫార్మాట్‌లో భారత్ విశ్వవిజేతగా ఆవిర్భవించింది. 

* టీమిండియా మహిళల జట్టు  సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ నుంచి తప్పించడం పెను వివాదానికి దారి తీసింది. దీనిపై కోచ్ రమేశ్ పవార్, మిథాలీ రాజ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. 

* టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది పరుగుల వరదను పారించాడు. తద్వారా వరుసగా మూడో సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యథిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 2018లో కోహ్లీ మొత్తం 2,563 పరుగులు సాధించాడు. 

* శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడంటూ భారత దర్యాప్తు సంస్థలు ఆరోపించడంతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇండోనేషియా నుంచి పెద్ద మొత్తంలో వక్క పోలుకలను శ్రీలంక మీదుగా భారత్‌కు రవాణా చేసి కోట్లాది రూపాయల విలువ గల సుంకాలను చెల్లించలేదని ఆయనపై ఆరోపణ. 

* టీమిండియాను నెంబర్‌వన్ జట్టుగా తీర్చిదిద్దడంతో పాటు అనేక ట్రోఫీలు గెలిపించిన ధోనీపై పేలవ ఫాం కారణంగా సెలక్టర్లు వేటేయ్యడం భారత క్రికెట్‌లో సంచలనం కలిగించింది.

* టీమిండియాలోకి చిన్న వయసులోనే అరంగేట్రం చేసిన పృథ్వీషా తన అరంగేట్రపు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి.. ఈ ఘనత సాధించిన 15వ భారత క్రికెటర్‌గా నిలిచాడు.

* భారత క్రికెటర్ సంజూ శాంసన్ ఓ ఇంటివాడయ్యాడు. కేరళకు చెందిన సంజూ తన చిన్ననాటి స్నేహితురాలు చారులతను వివాహం చేసుకున్నాడు.

* ఐపీఎల్ సీజన్-12 కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో జయదేవ్ ఉనద్కత్ రూ.8.4 కోట్లకు అమ్ముడు పోయి ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. జైపూర్‌లో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ జయదేవ్‌ను సొంతం చేసుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios