Asianet News TeluguAsianet News Telugu

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

టీంఇండియా యువ క్రికెటర్లు వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రముఖ టీవి ఛానల్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న భారత ఆటగాళ్లు హర్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మహిళను ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా మహిళల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిసిసిఐ వీరిపై చర్యలకు సిద్దమైంది.

BCCI show cause notice to Hardik Pandya, KL Rahul
Author
Mumbai, First Published Jan 9, 2019, 4:49 PM IST

టీంఇండియా యువ క్రికెటర్లు వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రముఖ టీవి ఛానల్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న భారత ఆటగాళ్లు హర్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మహిళను ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా మహిళల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిసిసిఐ వీరిపై చర్యలకు సిద్దమైంది.

సదరు టివి షోలో అసభ్యకరంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ ఇండియన్‌ క్రికెట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ  షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వీరి నుండి సమాధానం రాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చిరించింది. 

ప్రముఖ బాలీవుడ్ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఓ టీవి ఛానల్లో ''కాపీ విత్ కరణ్'' అనే షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. ఈ షోలో ఇటీవల యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సరదాగా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ హర్థిక్ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడాడు. అంతేకాకుండా తన సెక్స్, అపైర్లకు సంబంధించిన విషయాలను తల్లిదండ్రులతో పంచుకుంటానని...తాను వర్జినిటీ కోల్పోయిన విషయయాన్ని విషయాన్ని కూడా వారితో పంచుకున్నానంటూ తెలిపాడు. దీంతో పాటు మహిళల్ని కించపర్చడం వివాదానికి దారితీసింది. 

సంబంధిత వార్తలు

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు
 
Follow Us:
Download App:
  • android
  • ios