Asianet News TeluguAsianet News Telugu

ఆసీస్ తో టీ20, వన్డే సిరీస్ లకు భారత జట్టు ఇదే..

ఆస్ట్రేలియాతో ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్న టీ20, వన్డే సీరిస్‌ల కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్ వన్డే సీరిస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు టీ20 సీరిస్ కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో జరుగుతున్న ఈ సీరిస్ ద్వారా మళ్లీ భారత జట్టు పగ్గాలని చేపట్టనున్నాడు. అయితే పెద్దగా మార్పులేమీ లేకుండానే బిసిసిఐ భారత జట్లును ఎంపికచేసింది. 
 

BCCI Announces Squad For T20I Series And ODIs vs Australia
Author
Mumbai, First Published Feb 15, 2019, 5:19 PM IST

ఆస్ట్రేలియాతో ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్న టీ20, వన్డే సీరిస్‌ల కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్ వన్డే సీరిస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు టీ20 సీరిస్ కు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో జరుగుతున్న ఈ సీరిస్ ద్వారా మళ్లీ భారత జట్టు పగ్గాలని చేపట్టనున్నాడు. అయితే పెద్దగా మార్పులేమీ లేకుండానే బిసిసిఐ భారత జట్లును ఎంపికచేసింది. 

తమ స్వదేశంలో టెస్ట్, వన్డే సీరిస్ ను కోల్పోయిన కసితో ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. దీంతో భారత్‌ను కూడా వారి స్వదేశంలోనే ఓడించి తమకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఆసిస్ ఆటగాళ్లు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే విదేశాల్లో మంచి ఫామ్ తో వరుసగా విజయాలు సాధించిన ఊపులో టీంఇండియా వుంది. దీంతో స్వదేశంలో కూడా అదే విజయపరంపరను కొనసాగించాలని భారత్ భావిస్తోంది. ఇలా భారత్-ఆస్ట్రేలియా జట్లు ఈ టీ20, వన్డే సీరిస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫోటీ రసవత్తరంగా మారింది. అలాగే ప్రపంచ కప్ కు ముందు జరుగుతున్న చివరి సీరిస్ కావడంతో అభిమానుల్లో కూడా దీనిపై ఆసక్తి పెరిగింది. 

ప్రపంచ కప్ కు ముందు భారత్ ఆస్ట్రేలియాతో రెండు టీ20, ఐదు వన్డేలు ఆడనుంది. మొదటి టీ20 ఈ నెల 24న విశాఖ పట్నంలో ప్రారంభంకానుంది. అలాగే మార్చి 2 నుండి వన్డే సీరిస్ ప్రారంభంకానుంది. హైదరాబాద్ లో కూడా ఓ వన్డే మ్యాచ్ జరగనుంది. 

టీ20  సీరిస్ కోసం భారత జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, ధినేశ్ కార్తిక్, ఎంఎస్.ధోని(వికెట్ కీఫర్), హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్య, విజయ్ శంకర్, యజువేందర్ చాహల్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్, మయాంక్ మార్కండే

మొదటి, రెండో వన్డే జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేధార్ జాదవ్,ఎంఎస్.ధోని, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ సింగ్ బుమ్రా,మహ్మద్ షమీ, యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, సిద్దార్థ్ కౌల్, కేఎల్ రాహుల్

మూడో వన్డే జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేధార్ జాదవ్,ఎంఎస్.ధోని, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, విజయ్ శంకర్, రిషబ్ పంత్,కేఎల్ రాహుల్

Follow Us:
Download App:
  • android
  • ios