Asianet News TeluguAsianet News Telugu

''ధోనీ దరిదాపుల్లోకి కూడా వారు రాలేరు...వారి కోసం తప్పించారా?''

రేపటి (ఆదివారం) నుండి వెస్టిండీస్ తో జరగనున్న టీ20 సీరిస్  కు మహేంద్ర సింగ్ ధోనీని సెలెక్టర్లు ఎంపికచేయకపోవడం వివాదంగా మారుతున్న విషయం తెలిపిందే. కేవలం దీనికే కాదు త్వరలో ఆస్ట్రేలియాతో జరగునున్న టీ20 సీరిస్ కు కూడా ధోనిని ఎంపికచేయలేదు. ధోనీపై సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే కొందరు మాజీ క్రికెటర్లు స్పందించారు.టీంఇండియా మాజీ కెప్టెన్ సైరవ్ గంగూలీ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు మాట్లాడితే....గవాస్కర్ మాత్రం ప్రస్తుతం ధోనీ అవసరం చాలా ఉందంటూ సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుబడుతున్నట్లు మాట్లాడారు. 

Ashish Nehra speaks about MS Dhoni
Author
New Delhi, First Published Nov 3, 2018, 5:19 PM IST

రేపటి (ఆదివారం) నుండి వెస్టిండీస్ తో జరగనున్న టీ20 సీరిస్  కు మహేంద్ర సింగ్ ధోనీని సెలెక్టర్లు ఎంపికచేయకపోవడం వివాదంగా మారుతున్న విషయం తెలిపిందే. కేవలం దీనికే కాదు త్వరలో ఆస్ట్రేలియాతో జరగునున్న టీ20 సీరిస్ కు కూడా ధోనిని ఎంపికచేయలేదు. ధోనీపై సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే కొందరు మాజీ క్రికెటర్లు స్పందించారు.టీంఇండియా మాజీ కెప్టెన్ సైరవ్ గంగూలీ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు మాట్లాడితే....గవాస్కర్ మాత్రం ప్రస్తుతం ధోనీ అవసరం చాలా ఉందంటూ సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుబడుతున్నట్లు మాట్లాడారు. 

తాజాగా మరో మాజీ క్రికెటర్ కూడా ఈ విషయంపై స్పందించాడు. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ధోనికి అండగా నిలిచారు. ధోని ఫామ్ గురించి క్రికెట్ అభిమానులు ఆందోళన చెందవద్దని... ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ ఆయన పామ్ లోకి వస్తారని నెహ్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సీరిస్ కు ధోనికి ఎంపికచేయక పోవడాన్ని నెహ్రా తప్పుబట్టారు. యువ క్రికెటర్ రిషబ్ పంత్ కోసం అనుభవజ్ఞుడైన ధోనిని పక్కనబెట్టడం సరికాదని అన్నారు. టీ20 జట్టులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ లు బాగానే ఆడుతున్నారు. కానీ వారెప్పుడూ ధోనీతో సమానం కాదని....కనీసం ధోని దరిదాపుల్లోకి కూడా వారు చేరుకోలేరని వ్యాఖ్యానించారు.

యువ ఆటగాళ్లకు ధోనీ చాలా ఎంకరేజ్ చేస్తారని నెహ్రా అన్నారు. వారికి విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారని తెలిపారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ కోహ్లికి జట్టు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో ధోని సాయపడుతున్నాడని ఆశిష్ నెహ్రా వివరించాడు. 

మరిన్ని వార్తలు

రిషబ్ పంత్ కోసమే.. ధోనీ అలా చేశాడు.. కోహ్లీ

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్

ధోని ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు.. గంగూలీ షాకింగ్ కామెంట్స్

 

Follow Us:
Download App:
  • android
  • ios